టిఆర్ఎస్ పార్టీలో చేరనన్న రావులపల్లి రాంప్రసాద్. భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 10 : భద్రాచలం డివిజన్లో సిపిఐ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాయిన్ చేయనున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా మంత్రి పువ్వాడ జై కుమార్ రావులపల్లి రాంప్రసాద్ను టిఆర్ఎస్ పార్టీలోకి రావలసిందిగా అనేకసార్లు భక్తుడు చేసినట్లు తెలిసింది. మంత్రి పువ్వాడ జై రావులపల్లి రాంప్రసాద్ కు స్వయాన బావ కావడం వల్ల పువ్వాడ అజయ్ కుమార్ తోని పయనించాలని నిర్ణయించుకొని టిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు తెలుస్తుంది. భద్రాచలం డివిజన్లో సిపిఐ పార్టీ రావులపల్లి రాంప్రసాద్ వాళ్ళని కంచుకోటగా ఉన్నది. భద్రాచలం డివిజన్లో రావులపల్లి రాంప్రసాద్ సిపిఐ పార్టీని భుజాలు వేసుకొని నడిపిస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే సిపిఐ పార్టీలో పనిచేసే సీనియర్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీని నడిపించే రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. సిపిఐ పార్టీకి అన్ని విధాలుగా తన వంతు కృషి చేశారు. భద్రాచల పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టింది కూడా రావులపల్లి రాంప్రసాద్ మొదటి నుండి రావులపల్లి కుటుంబం సిపిఐ పార్టీలోని ఉంటూ పార్టీని ఎంతో బలోపేతం చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాలు దృశ్య పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పని చేసేందుకు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.