కేసీఆర్ పాలనలో స్వామివారి కల్యాణానికి ఒకసారి మాత్రమే వచ్చారు
బపోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కుటుంబ తెలంగాణ అయ్యింది
బకేసీఆర్ కుటుంబంలో కొలువులు వచ్చాయికానీ..నిరుద్యోగులకు రాలే
బకాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్ చెంప చెళ్లు మనిపించాలి
బకాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమపథకాలతో రాష్ట్ర అభివృద్ధి
బభద్రాచలం కాంగ్రెస్ పార్టీ కార్నర్‌మీటింగ్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ

భద్రాచలం/చర్ల/దుమ్ముగూడె,ప్రజా తంత్ర,నవంబర్‌్ 21 : తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని గెలిపించిన వెంటనే భద్రాచలం రామాలయం అభివృద్దితో పాటుగా భద్రాచలం అభివృద్దిచేసే భాద్యత తాము తీసుకుంటామని అందుకు భద్రాచలం ప్రజలకు హామీ ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రథసారధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చారు. మంగళవారం భద్రా చలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం మండలాలో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ పొదెం వీరయ్యను గెలిపించాలని కోరుతూ భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్ సెంటర్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను 10సంవత్సరాలపాటు కుటుంబ తెలంగాణగా కేసీఆర్ మార్చేసారని,కేవలం తన కుంటుంబ పాలన చేసారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,ప్రజాసంక్షేమంకో సమే తాము పాటుపడతామని గుర్తు చేసారు.ఏకంగా శ్రీసీతారామచంద్రస్వామివారిని కూడా మోసం చేసి మహానీయుడిని విమర్శించారు.
రామాల యం అభివృద్దికి 100కోట్లు ఇస్తామని చెప్పి 10సంవత్సరాలు గడిచిపోయిందని అన్నారు. 10సంవత్సరాలలో 10సార్లు స్వామివారి కల్యాణం జరిగితే కేవలం ఒకసారిమాత్రమే కేసీఆర్ ముత్యాల తలంబ్రాలు,పట్టువస్త్రాలు తీసుకువచ్చారని గుర్తు చేసారు. అలాంటి ముఖ్యమంత్రి మనరాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భద్రాచలంకు నాకు విడదీయలేని బంధంఉందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ది ఏమి చేయలేదని విమర్శించారు.భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్ధి పొదెం వీరయ్యను గెలిపించండి భద్రాచలం రామాలయంతోపాటు భద్రాచలం అభివృద్ది చేసి చూపిస్తామని అది మాభాద్యత అని తుమ్మల,పొంగులేటి హామీ ఇచ్చారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రమాణస్వీకారం చేయబోతున్న దని చెప్పారు. అలాగే అభ్యర్ధి పొదెంవీరయ్య మాట్లాడుతూ 30వతేదీన జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటువేసి నన్న గెలిపించాలని కోరారు. ఈ కార్నర్ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయ కులు, తెలుగుదేశం నాయకులు, సిపిఐ నాయకులతోపాటు భారీగా ప్రజలు పాల్గొన్నారు.
బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం
చర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం. మంగళవారం భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదాం వీరయ్య గెలిపించాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బస్టాండ్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్ లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందిం దని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదాం వీరయ్య మెజార్టీతో గెలిపించాలని పిలుపుని చ్చారు.

జోష్ నింపిన పొంగులేటి,తుమ్మల పర్యటన
దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల కురుక్షేత్రం ధర్మానికి, అధర్మానికి.. న్యాయానికి, అన్యాయా నికి.. ప్రజాపాలనకు, దొరల పాలనకు… మధ్య జరుగుతుందని మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సారథి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం రోడ్డు కార్నర్లో మాట్లాడారు.ఉప్పెనల దూసుకొస్తున్న కాంగ్రెస్ ప్రభంజనం ఎన్నికల ఫలితాల ద్వారా కేసీఆర్ను బంగాళాఖాతంలో కలపాలన్నారు. నీతిమంతు డు, నిజాయితీపరుడు, డబ్బుకు అమ్ముడు పోనీ ఇందిరమ్మవారసుడు,కాంగ్రెస్ ముద్దుబిడ్డ, స్థానిక ఎమ్మెల్యే వీరయ్య నిజాయితీకి పట్టం కట్టాలని అన్నారు. మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ వీరయ్య గెలుపుకు ఎర్రజెం డాలు, పసుపు జెండాలు తోడుగా ఇందిరమ్మ రాజ్య స్థాపనకు స్థానిక అభ్యర్థి వీరయ్యను గెలిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.