భారతదేశ దూరదర్శిన్‌ ‌టీవీకి 63 – ఏండ్లు

(స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా సవాళ్లను దాటుతూ సాఫల్యత వైపు స్వదేశీ పయనం)

దేశంలో నేడు వినోదాల కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఇతర దృశ్య శ్రవణ ప్రసారాలను ప్రజల కోరిక మేరకు అందిస్తున్న సాధనంగా టీవీ మానవాళికి అమూల్య సేవలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృశ్యాలను, వీడియోలను, ప్రత్యక్ష ప్రసారాలను క్షణాల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఇంటింటికి చేరవేయడంలో టెలివిజన్‌ ‌ప్రముఖ పాత్రను నిర్వహిస్తున్నది. సుదూర దృశ్యాలను అందరి దరికి చేర్చే బహుళ ప్రచార సాధనమే దూరదర్శన్‌ అని పిలుస్తున్నాం.

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో డిడి లేదా దూరదర్శన్‌ ‌ప్రసారాలు 15 సెప్టెంబర్‌ 1959‌న ప్రారంభించబడింది. ప్రసార భారతిలో అత్యంత పెద్ద వ్యవస్థగా స్టూడియోలు, ట్రాన్స్మిటర్లతో టీవీ ప్రసారాలను ప్రజల చేరువకు తీసుకువస్తున్నది. నేటి దూరదర్శిన్లో ఉపగ్రహ టీవీ, సమాచార ప్రసారాలు, ఇంటర్నెట్‌, ఓటిటి లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  ప్రతి ఇంటికి వివిధ వైవిధ్య భరిత కార్యక్రమాలను ప్రసారం చేయగల అత్యవసర ఎలక్ట్రానిక్‌ ఉపకరణం అయ్యింది. ’సత్యం శివం సుందరం’ అనే నినాదంతో హిందీ, ఆంగ్లం, ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రసారాలను ప్రతి క్షణం దేశ నలుమూలలకు అందిస్తున్నది.

దూరదర్శన్‌ ‌విస్తరణ:
1959లో ఢిల్లీ కేంద్రంగా 40 కిమీ పరిధిలో ప్రారంభమైన దూరదర్శన్‌ ‌ద్వారా బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌ప్రసారాలు, 1965లో రేడియోతో కలిసి నిత్యం డిడి ప్రసారాలు ప్రారంభమైనాయి. 1965లో బొంబాయి, అమృత్సర్‌ ‌నగరాల్లో డిడి ప్రసార కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1972 వరకు ఏడు నగరాలకు విస్తరించింది. 01ఏప్రిల్‌ 1976‌న రేడియో, డిడి విభాగాలు వేరు చేయబడగా, 1982లో పూర్తి స్థాయి జాతీయ ప్రసారాలను కలర్‌ ‌టివీల ద్వారా ఆసియా క్తీడల వార్తలను కూడా చేయగలిగే స్థాయికి ఎదిగింది. నేడు దేశవ్యాప్తంగా 46 స్టూడియోలు, 21 టీవీ చానెల్స్, 17 ‌ప్రాంతీయ ఉపగ్రహ చానెల్స్, 11 ‌రాష్ట్ర నెట్వర్కులు, అంతర్జాతీయ చానెల్‌, ‌స్పోర్టస్ ‌చానెల్‌, ‌డిడి కిసాన్‌, ‌డిడి భారతి, డిడి ఉర్దూ, డిడి రిట్రో లాంటివని సేవలు అందిస్తున్నాయి. 2018లో అరున్ప్రభ, 2019లో మరో 11 రాష్ట్రాల ప్రాంతీయ భాషా చానెల్స్ ‌ప్రారంభమైనవి.

రామాయణ్‌ ‌సీరియల్‌ ‌ప్రభంజనం:
1987-88లో ‘‘రామాయణ్‌’’ ‌సీరియల్‌ ‌ప్రసారంతో దూరదర్శన్‌ ఇం‌టింటా కనీస అవసరమై పూజలను అందుకుంది. దాని తరువాత 1988-89లో ‘మహాభారత్‌‘ ‌సీరియల్‌ ‌ప్రసారంతో డిడి ప్రాచుర్యం ఆకాశాన్నంటింది. 1959లో రేడియో, టివీ ప్రసారాలకు ఉద్దేశించిన ఒక్క స్టూడియో నుంచి నేడు 66 స్టూడియోలు, 34 ఉపగ్రహ చానెల్స్ ‌నిత్యం ఉచిత ప్రసారాలను అందిస్తున్నది. దేశవ్యాప్తంగా అనేక టీవీ చానెల్స్ ‌ప్రసారాలు అందుబాటులో ఉన్నప్పటికీ దూరద్శన్‌ ‌ప్రసారాలకు ఆదరణ తగ్గడం లేదు. నేడు 146 దేశాలకు డిడి ఇండియా ప్రసారాలు చేరుతున్నాయి. నాడు డిడిలో ప్రసారమైనా రామాయణ్‌ ‌సీరియల్ను 7.7 కోట్ల ప్రేక్షకులు చూడడం ఓ ప్రపంచ రికార్డుగా నిలిచింది. నేడు రాజ్యసభ, లోకసభ ప్రత్యక్ష ప్రసారాలను కూడా డిడి అందిస్తున్నది. టెలివిజన్‌ ‌లేని మానవాళిని ఊహించలేం. రేడియో ఒక్కటే వార్తా ప్రసారాల సాధనంగా భావించిన మానవాళికి మరో వరంగా టీవీ ప్రసారాలు ప్రపంచానికి అత్యంత అబ్బుర పరిచే వార్తలు, వినోదాలు, ప్రత్యక్ష ప్రసారాలను చూస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page