ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 13: షాబాద్ మండల పరిధిలోని చందనవెళ్లి గ్రామంలోని చెరువులో ఎమ్మెల్యే కాలే యాదయ్య ముదిరాజ్ సోదరులకు లక్ష 18 వేల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసి వారితో కలిసి చెరువులోకి వదిలారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని కాలే యాదయ్య అన్నారు.మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేసీఆర్ అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పథకం అద్భుత ఫలితాలనిస్తున్నది యాదన్న చెప్పారు.ఏడేండ్లలోనే ఈ పథకం 2016-17లో 2,252 కోట్లుగా ఉన్న మత్స్య సంపద విలువ,2022-23 నాటికి 195 శాతం పెరిగి 6,656 కోట్లకు మత్స్య సంపద పెరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో చందన వెళ్లి సర్పంచ్ కోలాన్ ప్రభాకర్ రెడ్డి,చందనవెళ్లి గ్రామస్తులు,రవి,రామచంద్రయ్య, మహేందర్, ముదిరాజ్ సంఘం నాయకులు ఉన్నారు.