‌మత్స్యకారులకు టిడిపి అరకొర సాయం

తాముసంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నాం
1,23,519 మత్స్యకారుల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ
టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా  గమించాలి
ఎన్నికలొస్తేనే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు
లేకుంటే హైదరాబాద్‌లో పడకేస్తారు
మత్స్యకార భరోసా నిధుల విడుదలలో సిఎం జగన్‌

‌బాపట్ల,మే16 :తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే అందిందని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో రూ. 4 వేల మాత్రమే ఇచ్చారని, అది కూడా కొందరికి మాత్రమే అందేదని అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా ఐదో విడత వైఎస్సార్‌ ‌మత్స్యకార భరోసా నిధులను సిఎం వైఎస్‌.‌జగన్‌ ‌మంగళవారం విడుదల చేశారు. దీనికి ముందుగా వైఎస్సార్‌ ‌మత్స్యాకార భరోసా నిధుల విడుదల కార్యక్రమం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సిఎం జగన్‌ ‌పరిశీలించారు. సభా వేదికపై కంప్యూటర్‌లో బటన్‌ ‌నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మొహన్‌ ‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. టీడీపీ పాలనలో 1100 బోట్లకు మాత్రమే రాయితీ ఇస్తే.. ఇప్పుడు 20 వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో డీజిల్‌ ‌పై రూ.6 మాత్రమే రాయితీ ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వ పాలనలో డీజిల్‌ ‌పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనను చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. పేద వారికి సాయం చేస్తుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, మైనారిటీలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. తాను మంచిని నమ్ముకున్నానని, ప్రజలను నమ్ముకున్నానని సీఎం జగన్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నామని వెల్లడించారు.

చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతిలో.. అధికారం లేకపోతే జూబ్లీహిల్స్‌లో ఉంటారని సీఎం జగన్‌ ‌విమర్శించారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్‌ ‌లో ఉండటం వీరి పని అంటూ ఆరోపించారు. ఏపీలోనే తన శాశ్వత నివాసం ఉందని, తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు జగన్‌. ‌ప్రధానులను, రాష్ట్రపతులను చేశానని చెప్పుకునే పెద్ద మనిషికి.. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగే దమ్ముందా అంటూ జగన్‌ ‌సవాల్‌ ‌విసిరారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబు నాయుడుకు లేదని, ఆయనకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌ ‌పై ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాబు, న దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులను, కుయుక్తులనేనని జగన్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని, ఆయన పేరు తీస్తే గుర్తుకు వచ్చేది వెన్నుపోటే అని విమర్శలు గుప్పించారు. ఎన్ని వ్యవస్థనలు తనపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడకుండా, ప్రజల తరఫున నిలబడి మంచి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం. కు మంచి జరిగితే  బిడ్డకు తోడుగా నిలవండంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రిని కలిస్తే చాలు తనపై దుష్పచ్రారం చేస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్‌ ‌తో అంటకాగిన వాళ్లు తనను విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్‌ ‌మండిపడ్డారు. పొత్తులు పెట్టుకుని, తెగదెంపులు చేసుకునేది వీళ్లేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహాలు చేసుకునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లేనని ఎద్దేవా చేశారు.

గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే అందిందని.. టిడిపి ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేదని చెప్పారు. ఏపీలో దోచుకొని ఆ తరువాత హైదరాబాద్‌లో ఉండటం వారి పని అని దుయ్యబట్టారు. తనకు మాత్రం ఎపిలోనే శాశ్వత నివాసం ఉందని, తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నానని అన్నారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషి.. ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా ?  అని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదనీ, ఆయనకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు, తన దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులు, కుయుక్తులనే నన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదనీ, ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనని సిఎం జగన్‌ ‌ఘాటు విమర్శలు చేశారు. ఎన్ని వ్యవస్థలను తనపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదని, ప్రజల తరపున నిలబడి మంచి చేస్తున్నానని అన్నారు. ’ కు మంచి జరిగితే  బిడ్డకు తోడుగా నిలవండి ’ అని కోరారు. ప్రధానిని కలిస్తే చాలు తనపై దుష్పచ్రారం చేస్తారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళుతనను విమర్శిస్తున్నారని, పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లేనని.. వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లేనని ముఖ్యమంత్రి జగన్‌ ‌దుమ్మెత్తిపోశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page