ఎన్నికలకు ముందు రజనీకాంత్..తరువాత గజనీకాంత్
అశోక్‌నగర్ వెళ్లి ఒక్క ఉద్యోగం అయినా వొచ్చిందా అడుగుదాం
కాంగ్రెస్ ఉద్యోగం ఇచ్చిందంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా
బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల మేరకే ఉద్యోగాల భర్తీ
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
ప్రభుత్వ తీరు అధ్వాన్నంగా ఉందని అసెంబ్లీలో కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : బడ్జెట్లో కోతలు, ఎగవేతలతో మసిబూసి మారేడుకాయ చేశారని బిఆర్ఎస్ ఎంఎల్ఏ కెటిఆర్ విమర్శించారు. రైతు భరోసాకు బడ్జెట్ ఏదని ప్రశ్నించారు. పెన్షన్ డబుల్ చేసే కేటాయింపులు ఎక్కడని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వొచ్చారని, తర్వాత ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారని, నిజంగా రాహుల్ ట్వీట్, వీరి నిర్వాకం చూసిన తర్వాత గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల దగ్గర ట్యూషన్ నేర్చుకుంటా అంటుండెనని కెటిఆర్ ఉద్దేవా చేశారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని బ్జడెట్లో చెప్పారని, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు..
పరీక్ష ఎప్పుడు జరిగింది…నియామకాలు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరు ఎన్నికల ముందు రజినీకాంత్, తర్వాత గజినీకాంత్‌లా ఉందని బిఆర్ఎస్ ఎంఎల్ఏ కెటిఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని, మభ్యపెడితే ఊరుకోదని కేటీఆర్ హెచ్చరించారు. చార్జిషీట్లు, రికవరీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ ఒకటి విసిరారు. అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి వెళదామని..ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చినట్లు యువకులు చెబితే అక్కడే రాజీనామా చేయడమే కాదు..రాజకీయ సన్యాసం చేస్తానంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
పైగా రేవంత్, భట్టికి పౌర సన్మానం కూడా చేస్తామని కేటీఆర్ వెల్లడిరచారు. అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చను కేటీఆర్ ప్రారంభిస్తూ..పదేళ్ల క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ చీకట్లతో నిండిపోతుందని చెప్పారని.. తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా..అంటూ ఉమ్మడి రాష్ట్రంలో హేళన చేశారని గుర్తుచేశారు. పదేళ్లలో రాష్ట్ర సంపద పెరిగిందని గతంలో భట్టి విక్రమార్క చెప్పారని..కానీ అధికారంలోకి వొచ్చాక..మాట మారుస్తున్నారన్నారు. విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందన్నారని.. తెలంగాణ వొస్తే శాంతిభద్రతల సమస్యలు వొస్తుందన్నారని అన్నారని, ఏపీ-తెలంగాణలో మత ఘర్షణలు వొస్తాయన్నారని, అలాగే తెలంగాణలో నక్సలైట్ల రాజ్యం వొస్తుందన్నారని ఆనాటి సంగతులను గుర్తుచేశారు. అంతే కాకుండా తెలంగాణ వారికి పరిపాలన సామర్థ్యం ఉందా? అని కూడా అన్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావని.. ఉన్నవి పోతాయన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు టాప్`4 స్టేట్స్లో తెలంగాణ ఉందని తెలిపారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులోనే పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పాలన గురించి వారు మాట్లాడుతున్నప్పుడు..గత కాంగ్రెస్ పాలనపై తామెందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు. వోట్లకు ముందేమో అభయహస్తం..వోట్ల తర్వాత శూన్యహస్తమని విమర్శించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంచి నిర్ణయాలకు బీఆర్ఎస్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. స్కిల్ వర్సిటీని తప్పకుండా స్వాగతిస్తామని తెలిపారు. రాష్ట్రం క్యాన్సర్, ఎయిడ్స్ రోగిలా దివాలా తీసిందనడం కరెక్ట్ కాదన్నారు. కొరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. కొరోనా ముందు తాము కూడా జీతాలు సక్రమంగానే ఇచ్చామని చెప్పారు. రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి ఆగవద్దని అనుకున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సాయం ఆపకూడదని నిధులు మళ్లించి ఉండవచ్చని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్లకు 10 నెలలుగా జీతాలు లేవని.. బీఆర్ఎస్ పాలనలో అప్పులు.. రెవెన్యూ బిల్లులకు లోబడి ఉన్నామన్నారు. తాము చేసిన నికర అప్పు రూ.3,85,340 కోట్లు మాత్రమేనని, చేసిన అప్పులు చెప్పినవాళ్లు..తాము ఇచ్చిన ఆస్తుల గురించి చెప్పాలని, సందప చూస్తేనే అప్పులు ఇస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక తమ హయాంలో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడో ఇచ్చామో తేదీలు ఉన్నాయని, స్టాఫ్ నర్సులకు 2022 డిసెంబర్ 20న నోటిఫికేషన్ ఇచ్చి 2023 ఆగస్టులో పరీక్షలు నిర్వహించామని, సింగరేణి ఉద్యోగులకు 2022 జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చి అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించామని, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చామని, 2022 ఆగస్టులో ప్రిలిమ్స్, 2023 జనవరిలో ఫిజికల్ టెస్టులు, 2023 ఏప్రిల్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించామని, అయితే ఇవన్నీ కలిపి 30 వేల ఉద్యోగాలు తామే ఇచ్చామని ప్రస్తుత కాంగెస్ ప్రభుత్వంలోని పెద్దలు అంటున్నారని కెటిఆర్ విమర్శించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆ ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయ్యాయని, ఇప్పుడు వీరు నియామక ప్రతాలు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రజలను, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించిన వారి విూద ఛార్జిషీటు వేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. జాబుల జాతర బదులు అబద్ధాల జాతర నడుస్తుందని, ఇంట్లో ఉన్న క్యాలెండర్ మరో నాలుగు నెలల్లో మారిపోతది కానీ జాబ్ క్యాలెండర్ అత్తా..పత్తా లేదని కేటీఆర్ విమర్శించారు. అశోక్‌నగర్‌లో ఏ ఒక్క యువతి, యువకుడు అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క ఉద్యోగం వొచ్చిందని చెప్పినా.. అక్కడే తాను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కొత్తగా ఉద్యోగాలు ఇచ్చారని ఎవరైనా చెబితే అక్కడే ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో తమ పార్టీ తరపున లక్షలాది యువకులతో సీఎం, డిప్యూటీ సీఎంకు పౌర సన్మానం చేయిస్తానని కేటీఆర్ తెలిపారు.
ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని ఆరోపణలు చేశారు. ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామని హావిూ ఇచ్చారని చేయండి. మూసీని లండన్ చేస్తాం అంటున్నారు.. చేయండి. మూసీ సుందరీకరణను స్వాగతిస్తున్నాము. రూ.16వేల కోట్లతో మేము ప్రతిపాదనలు
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని ఆరోపణలు చేశారు. ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామని హావిూ ఇచ్చారని చేయండి. మూసీని లండన్ చేస్తాం అంటున్నారు.. చేయండి. మూసీ సుందరీకరణను స్వాగతిస్తున్నాము. రూ.16వేల కోట్లతో మేము ప్రతిపాదనలు