ఓబీసీలను మోదీ సర్కార్ నిర్తక్ష్యం
చర్చ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపి రాహుల్ వెల్లడి
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 20 : మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే, బిల్లులో ఓబీసీ కోటా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చలో ఆయన పాల్గొంటూ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. భారత ప్రభుత్వంలోని సెక్రటరీల నియామకాల్లో ఓబీసీలను మోదీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
జీఓఐలో 90 మంది సెక్రటరీలు ఉండగా, అందులో ఓబీసీలు ముగ్గురేనని, ఓబీసీ సెక్రటరీలు లేకపోవడం ఆ సామాజికవర్గాన్ని అమానించడమేనని, ఈ పరిస్థితిని ప్రభుత్వ మార్చాలని సూచించారు.మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం ఆమోదించి, అమలు చేయాలని కేంద్రాన్ని రాహుల్ కోరారు. నియోజకవర్గాల పునర్విభజన, జనగణనను ఆ తర్వాత చేపట్టవచ్చని, బిల్లు అమలు చేయడానికి వాటి అవసరం లేదని అన్నారు. కులగణన లెక్కలను బహిరంగం చేయాలని కేంద్రానికి సవాలు విసిరారు. వి•రు ఆ గణాంకాలను బయటపెట్టండి. లేకుంటే ఆ పని కాంగ్రెస్ చేస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.