మానవ హక్కుల ఉల్లంఘన అమానవీయం, శిక్షార్హం..!

(రేపు ప్రపంచ మానవ హక్కుల దినం)

10డిసెంబర్‌1948న ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల చొరవతో ‘యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హూమన్‌ రైట్స్‌ (యిహెచ్‌ఆర్‌)’ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏట 10 డిసెంబర్‌న ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ మానవ హక్కుల దినం (వరల్డ్‌ హూమన్‌ రైట్స్‌ డే)’’ పాటిస్తున్నారు. కుల, మత, రంగు, జాతి, లింగ, భాష, రాజకీయ నమ్మకాలు లాంటి కారణాలతో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, అందరికీ సమాన హక్కులు కల్పించడం, సమానంగా భాద్యతలను కూడా తీసుకోవడం లాంటివి అవగాహన పరచడం జరుగుతుంది. ఇటీవల నిర్వహించిన మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ‘నేషనల్‌ హూమన్‌ రైట్స్‌ ఇనిస్టిట్యూషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)’ 75వ సమావేశం న్యూఢల్లీిలో జరగడం, ‘న్యూఢల్లీి డిక్లరేషన్‌’ తీసుకోవడం కూడా జరగడం ముదావహం. ప్రభుత్వ చట్టాలు కొందరికి చుట్టాలుగా మారడంతో పాటు పౌరుల మధ్య విచక్షణతో కూడిన పలు కారణాలతో మానవ హక్కుల ఉల్లంఘనలు, హక్కుల హననాలు సర్వ సాధారణంగా జరుగుతుండడా విచారకరం, ఖండనీయం.

ప్రపంచ మానవ హక్కుల దినం-2024 నినాదం
ప్రపంచ మానవ హక్కుల దినం – 2023 నినాదంగా ‘స్వేచ్ఛ, సమానత్వం, అందరికీ సమ న్యాయం (ఫ్రీడమ్‌, ఈక్వాలిటీ అండ్‌ జస్టిస్‌ ఫర్‌ ఆల్‌)’ అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం/అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటుగా ‘భవిష్యత్తులో సుస్థిర మానవ హక్కుల సంస్కృతి బలపడడం’ అనే అంశాన్ని కూడా చర్చించుట జరుగుతున్నది. పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను నిరంతరం పరిరక్షించడానికి భారతంలో ఎన్‌హెచ్‌ఆర్‌సి చేస్తున్న కృషి మరువలేనిది. ప్రభుత్వ యంత్రాంగాలు, సమస్త పౌర సమాజానికి మానవ హక్కుల పరిరక్షణ ప్రాధాన్యాలను వివరించడంతో పాటు పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అవగాహన పరచడం కొనసాగుతున్నది. గత మూడు దశాబ్దాలు భారతంలో మానవ హక్కుల ఉల్లంఘనల కేసులు 22.48 లక్షలు నమోదు కాగా, అందులో 22.41 కేసులు పూర్తి చేయబడి రూ: 230 కోట్ల ఉపశమన పరిహారాలు ఏర్పాటు చేయబడిరది.

ముఖ్య మానవ హక్కులు
ప్రధాన మానవ హక్కుల్లో రవాణా స్వేచ్ఛ, చట్టం ముందు అందరు సమానం, విచారణ/ అమాయకత్వ నటనల్లో సమాన హక్కులు, ఆలోచనల్లో స్వేచ్ఛ, అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ, మనస్సాక్షి మరియు మత విశ్వాసాల స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ, ఎన్నికలు/ప్రజా సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనే సమాన అవకాశాలు లాంటి పలు హక్కులు వస్తాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రత, ఆత్మ గౌరవం, సమానత్వం, గౌరవం, స్వతంత్రత లాంటి విలువలు కూడిన మానవ హక్కులు వస్తాయి. అందరికీ సమానంగా డిజిటల్‌ టెక్నాలజీ అందుబాటులోకి తేవడం, అభివృద్ధి ఫలాల సమ వితరణలు, పర్యావరణానికి మానవాళికి ఆరోగ్యకరమైన సంబంధం నెలకొల్పే ప్రయత్నాలను కొనసాగించడం సర్వదా జరగాలి. వెట్టిచాకిరీ అమానవీయమని, ఎవ్వరినీ అకారణంగా అరెస్టు చేయడం లేదా వేధించడం శిక్షార్హమని తెలుసుకోవాలి. తీర్పు వెలువడే వరకు నిర్దోషిగా చూడడం, వ్యక్తిగత గోప్యత హక్కులు, వివాహ హక్కు, సన్మార్గంలో ఆస్తులను సంపాదించుకునే హక్కు, ప్రజాస్వామ్య హక్కులు, చట్టబద్ధంగా పని చేసే హక్కు, సామాజిక సేవా హక్కు లాంటి మానవ హక్కులు కూడా పరిరక్షించబడాలి.

మానవ హక్కుల పరిరక్షణ అంశాలను చర్చించడం, హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడం, హక్కుల పరిరక్షణకు పోరాటాలు కొనసాగించడం, సామాజిక న్యాయ వితరణలో చురుకుగా పాల్గొనడం, హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఉద్యమించడం లాంటి కార్యక్రమాలను ఈ వేదిక నిర్వహించాలి. సమానత్వం, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు బాసటగా నిలబడడం లాంటి అంశాలను సదా గుర్తుంచుకోవాలి. మన నిత్యజీవితాల్లో అనేక మానవ హక్కుల ఉల్లంఘనలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నామే గాని స్పందించడానికి ముందుకు రావడం లేదు. విచక్షణ రహిత సమాజ నిర్మాణం జరగడానికి ప్రతి ఒక్కరం పాటు పడడానికి కంకనబద్దులం అవుదాం, సమసమాజ స్థాపనకు ఊతం ఇద్దాం.
-జలజ మధు
9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page