బుద్ధిజీవని గద్దెనెక్కిస్తే
నెత్తిపై సవారీ చేయవడ్తివి

ఉద్ధరిత్తవని పగ్గాలు ఇస్తే
పితురిగద్దలా పొడుస్తుంటివి

అండగా ఉంటవని తలిస్తే…
దండగ చేష్టలకు తెగబడ్తివి

బతుకు వెలిగిత్తవంటే
చితి మంటలు రాజేస్తివి

మెతుకు దేశం చేస్తవంటే
ఆకలి రాజ్యంగా మారిస్తివి

దేశ సంపద కొల్లగొట్టి
కార్పొరేట్లకు కట్టబెడ్తివి

జాతి ఆదరువులను
పరాయికి అప్పగిస్తివి

ఏకంగా సంపన్న దేశాన్ని
అంగడి బొమ్మను చేస్తివి

ఓయ్‌ ‌సామ్రాజ్యవా(మో)దీ !
ఏదైనా చెల్లుబాటని తలచి

ఇష్టారాజ్యాంగ పాలిస్తుంటే
భరించి జేజేలు కొట్టేందుకు
ఈ దేశజనం దద్దమ్మలు కాదు

చక్రవర్తుల తరిమికొట్టినోళ్ళు
జగత్‌ ‌జెట్టీల మట్టుబెట్టినోళ్లు
నువ్వు అతీతం కాదు సుమీ!

ఇకనైనా సోయికివచ్చి
స్వంత ఎజెండా పక్కనెట్టి
జనహిత పాలన సాగించు
కాదని అదే నైజం ప్రదర్శిస్తే
లంకాధీశుడు గొటబాయకు
పట్టిన గతి మీకు తప్పదు మరి!

(నిరంకుశ పాలకులకు  హెచ్చరికగా
  – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page