ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన చిన్నారులు…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి సోమవారం రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. వినికిడి సమస్య ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు సర్జరీలు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. కాగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ ‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి అవసరమైన సహాయాన్ని వేగంగా అందిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ ‌కోటిలోని ఈఎన్‌టీ హాస్పిటల్‌లో కోహ్లియర్‌ ఇం‌ప్లాంట్‌ ‌సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరగుతున్నాయి.

ఖరీదైన వినికిడి యంత్రాలు, సర్జరీలు చేయించుకున్నవారికి ఎల్‌వోసీ, సీఎంఆర్‌ఎఫ్‌ ‌ద్వారా ప్రభుత్వం అండగా నిలిస్తుంది. చికిత్సల అనంతరం ఉచితంగా వినికిడి యంత్రాలతో పాటు ఏడాది పాటు ఏవీటీఋఅడిషన్‌ ‌వర్బల్‌ ‌థెరపీ) అందిస్తారు. ఇటీవల ఈ సర్జరీలు చేయించుకున్న పలువురు చిన్నారులు ఇఎన్‌టి హస్పిటల్‌  ‌సూపరింటెండెంట్‌ ఆనంద్‌ ఆచార్య, వైద్యురాలు డీకే వీణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయానికి వొచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించినందుకు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

దుర్గకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బాసట…

బాలికకు అన్ని విధాలా అండగా నిలవాలని కలెక్టర్‌కు ఆదేశం…


హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించారు. నిర్మల్‌ ‌జిల్లా తానూర్‌ ‌మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి(36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ(11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. విషయం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్యా, వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి జిల్లా కలెక్‌ం‌ర్‌ అభిలాష్‌ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్‌ ‌వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page