ముదిరాజ్ లకు రాజ్యాధికారం ఇవ్వకపోతే పార్టీలను బొందపెడతాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో ఏ పార్టీ అయిన ఎమ్మెల్యే అభ్యర్థి లిస్టులో ముదిరాజ్ లకు 18 సీట్లు కేటాయించాలని, ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోతే రాజకీయ పార్టీలను బొంద పెట్టేందుకు ముదిరాజ్ సమాజం సిద్ధంగా ఉందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తనయుడు కాసాని వీరేశ్ ముదిరాజ్ అన్నారు.శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని తేజ కన్వెన్షన్ హాల్ లో జిల్లా ముదిరాజ్ సంఘం కార్యవర్గ సమావేశం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లను గుర్తించకపోగా ముదిరాజ్ లపై విషం చిమ్ముతుందన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు లో ఒక ముదిరాజ్ కు సిటు కేటాయించకపోవడం,ముదిరాజ్ లకు బీసీ బంధు వర్తింపజేయకపోవడం దీనికి నిదర్శనం అన్నారు.పార్టీలకు అతీతంగా సంఘం పని చేస్తుందని,కానీ పార్టీలు ముదిరాజ్ లను గుర్తించాలని అన్నారు.వికారాబాద్ జిల్లాలో ఉన్న ఒక రిజర్వుడ్ నియోజకవర్గము కాగా మిగిలిన 3 నియోజక వర్గాల్లో ముదిరాజ్ లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.జిల్లాలో ముదిరాజ్ లు అత్యధికంగా ఉన్నారని,ఇతర పార్టీ వాళ్ళు ముదిరాజ్ లో ఐక్యత లేదని భావిస్తున్నారని,దానిని ఓటు రూపంలో సత్తా చాటాలని ముదిరాజ్ లకు సూచించారు.కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి జెండా ఎత్తుకున్నారని,అందులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని,రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో 60 సీట్లు బీసీ లకు కేటాయిస్తామని తెలిపారు. అన్ని పార్టీలో ముదిరాజ్ లకు 18 సీట్లు అన్ని పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు.దానితో పాటు స్థానిక సంస్థ ఎన్నికలో ముదిరాజ్ లకు దామాషా ప్రకారం ఎన్నికలో పోటీ చేయించి పదవులు ఇవ్వాలని అన్నారు.ముదిరాజ్ ల కోసం జిల్లా కేంద్రంలో మహావీర్ ఆసుపత్రి ప్రక్కన్న ముదిరాజ్ భవనం నిర్మిస్తామని,కల్యాణ మండపం నిర్మాణము కోసం పాటు పడతామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ మహరాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ… ముదిరాజ్ ఓట్లు ముదిరాజ్ కు వేసుకోవాలి.తాండూరు లో ముదిరాజ్ ల సిటు వేరేవాళ్లకు ఇవ్వడం సరికాదు.60 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ లకు ఒక సిటు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అన్యాయానికి ఇతర పార్టీలో మార్పు వచ్చే వరకు పోరాటం చేద్దామని సూచించారు.అన్యాయం చేసే వారికి తప్పక బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.ముదిరాజ్ హక్కుల కోసం ఎన్ని రోజులు పార్టీలకు ఊడిగం చేసిన లాభం లేదని ఉద్యమాల ద్వారానే ముదిరాజ్ హక్కుల సాధన అవుతున్నాయని,అన్ని పార్టీలకు దడ పుట్టాలని,ముదిరాజ్ లకు టికెట్ కేటాయించే వరకు ఉద్యమాలు చేయాలని పిలుపు ఇవ్వాలని జిల్లా కమిటీని విజయ్ రాజ్ ముదిరాజ్ ధ్వజమెత్తారు.ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బిసి-ఏ లోకి చేర్చేలా ప్రభుత్వాల పై ఒత్తిడి చేయాలని,ఉద్యమాలతో మాత్రమే సాధ్యం అవుతుందని అన్నారు.పార్టీలకు అతీతంగా ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ తాండూరు ఇంచార్జి చంద్రశేఖర్ ముదిరాజ్,ముదిరాజ్ నాయకులు నర్సింలు ముదిరాజ్,శివరాజ్ ముదిరాజ్, పాండు ముదిరాజ్,గోపాల్ ముదిరాజ్,అంజయ్య ముదిరాజ్, మాణిక్యం ముదిరాజ్,రాఘవేందర్ ముదిరాజ్, కర్ణం రఘు ముదిరాజ్, సతీష్ ముదిరాజ్,ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, ముదిరాజ్ బంధువులు పెద్ద సంఖ్యలో  తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page