మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కడ్తాల మండలంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలకు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి ఓదార్చారు. సాలార్పూర్ గ్రామానికి చెందిన జేమ్లా, హరియా గత రెండు రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న దశరథ నాయక్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున రెండు కుటుంబాలకు రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.  హరియ కుటుంబానికి ఎంపీటీసీ ప్రియా  రమేష్ రూ.3వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం న్యామంతపూర్ గ్రామానికి చెందిన గోపాల్ దాస్, కృష్ణయ్య, కుటుంబీకులను పరామర్శించారు. కృష్ణయ్య కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. కడ్తాల మండల కేంద్రానికి చెందిన కొప్పుల లింగయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు దీంతో వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు అనంతరం రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 5వేల ఆర్థిక సహాయం అందించారు. దీంతో బాధిత కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 20వేల  ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రైతు కోఆర్డినేటర్ వీరయ్య,  సర్పంచులు  లక్ష్మీనరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ లచ్చి రామ్ నాయక్,  ప్రియా రమేష్, మాజీ ఎంపీటీసీ సువాలి  పంతు నాయక్, నాయకులు గంప శీను, చంద్రయ్య, శ్రీకాంత్, శీను, జంగయ్య, కృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page