ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 9 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలు చేసేందుకు బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు తమ తమ అనుచర గణంతో భారీ ర్యాలీలు నిర్వహించి ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఎదురెదురుగా తారాసపడి నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వెళుతున్న క్రమంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడి ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో ఇరు పార్టీల నాయకులు,కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.దీంతో బస్సులు,కార్లు,ప్రచార రథాల అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యయి.పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.ఇరువర్గారాలను చదరగొట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.నామినేషన్ ల ర్యాలీలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాయాల పాలైన గురు పార్టీల నాయకులను కార్యకర్తలను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్సలు చేయిస్తున్నారు.ఎన్నికలవేళ ప్రశాంతంగా ఉండే ప్రజల మన్ననలు పొందాలని ఏ ఒక్కరు కూడా ప్రజా నాయకుడిగా వెళ్లలేకపోతున్నారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.ఇరు పార్టీలు ప్రచార పర్వంలో నామినేషన్ల దాఖలు విషయంలో ఎన్ని లక్షలు వేల కోట్లు ఖర్చుపెట్టినంత మాత్రాన ఎవరూ కూడా గెలవలేరని ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వారే గెలుపొందారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి చిల్లర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఒకరిపై ఒకరి దాడులు చేసుకుంటే ఏమి వస్తుందని కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప వారు రేపు రానున్న కాలంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ప్రజా సేవకులుగా మిగిలిపోతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగించాలి తప్ప ఎలాంటి దాడులకు ఏ పార్టీలు కూడా పాల్పడవద్దని ఎమ్మెల్యే అభ్యర్థులకు హితవు పలుకుతున్నారు. ఇలాంటి భయాందోళన కార్యక్రమాలతో ప్రజలు బెంబేలెత్తి పోతారని ప్రజలు తెలుపుతున్నారు.