రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం

  • పార్టీని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలి
  • గెహ్లాట్‌ ‌తీరుపై మండిపడ్డ సచిన్‌ ‌పైలట్‌

రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం పుట్టింది. సీఎం అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌తీరుపై సీనియర్‌ ‌నేత సచిన్‌ ‌పైలట్‌ ‌తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . గులాంనబీఆజాద్‌ ‌లాగే పార్టీకి నమ్మకద్రోహం చేసేందుకు గెహ్లాట్‌ ‌కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఆజాద్‌ను పొగిడిన తరువాత ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. ప్రధాని మోదీని అశోక్‌ ‌గెహ్లాట్‌ ఆకాశానికి ఎత్తడం.. దానికి బదులుగా ఆయన్ను మోదీ ప్రశంసల్లో ముంచెత్తడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామమన్నారు. సెప్టెంబర్‌ 25‌న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంపై సీఎం అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌కు , సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పారని అన్నారు.

సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం క్రమశిక్షణారాహిత్యమే అవుతుందని కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌కూడా ప్రకటించిదన్నారు. అశోక్‌ ‌గెహ్లాట్‌ – ‌మోదీ పరస్పర ప్రశంసలను కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మంగళవారం రాజస్థాన్‌ ‌లోని బాంస్‌వాఢా జిల్లా మాన్‌గడ్‌ ‌ధామ్‌ ‌దగ్గర ద్ద భిల్‌ ఆదివాసీలు, ఇతర తెగల ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ వేదికపై రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌ ‌ముఖ్యమంత్రులు అశోక్‌ ‌గెహ్లాట్‌ , ‌శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌, ‌భూపేంద్ర పటేల్‌ ‌ప్రధానితో వేదిక పంచుకున్నారు. మహాత్మా గాంధీ నడయాడిన దేశానికి, ప్రజాస్వామ్య మూలాలు బలంగా ఉన్న దేశానికి ప్రధాని కావడంతో మోదీ ఏ దేశం వెళ్లినా అమితమైన గౌరవం పొందుతున్నారని అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌ప్రశంసించారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని అన్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాట్‌, ‌సచిన్‌పైలెట్‌ల మధ్య వైరం కొనసాగుతోంది. పార్టీని ధిక్కరిస్తూ తిరుగుబాటు ప్రకటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సచిన్‌ ‌పైలెట్‌ ‌వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో అనిశ్చితికి ముగింపుపలకాల్సిందేనని స్పష్టం చేశారు. హిమాచల్‌‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా సచిన్‌ ‌వి•డియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిశీలకులు కె.సి.వేణుగోపాల్‌ ‌రాజస్థాన్‌లో పరిస్థితులను పరిశీలిస్తున్నారని, ఇది క్రమశిక్షణా రాహిత్యమని, ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారని, చర్యలు తప్పవని అన్నారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఎంత సీనియర్‌ అయినా రూల్స్ ఒకటేనని అన్నారు. రాజస్థాన్‌ ‌పరిస్థితులపై కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే త్వరలో నిర్ణయం కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని అన్నారు.

గతంలో గెహ్లాట్‌ ‌మద్దతుదారులు చూపిన ధిక్కారానికి సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పారని అన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక బరిలో అధిష్టానం గెహ్లాట్‌ను ప్రకటించగా.. అందుకు ఆయన అంగీకరించినా.. రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి పదవి వీడేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి గెహ్లాట్‌ ‌వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలే కారణమని ఆ పార్టీ కేంద్ర పరిశీలకుల బఅందం తేల్చడంతో సోనియాకు క్షమాపణలు చెప్పారు. 2020లో పైలట్‌ ‌కూడా కొందరు ఎమ్మెల్యేలతో గెహ్లాట్‌ ‌ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page