రామగుండంలో వందపడకల… ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణానికి భూమిని కేటాయించండి

సిఎం కెసిఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి లేఖ
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కిషన్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కార్మికుల వైద్య అవసరాలను గుర్తించి హైదరాబాద్‌ ‌మహానగరంతో పాటు ఇతర తెలంగాణ జిల్లాలకు కూడా ఇఎస్‌ఐ ‌వైద్య సేవలను విస్తరించడానికి కేంద్ర కార్మిక శాఖ ఎన్నో చర్యలు చెపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎంతో కీలకమైన రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్‌ ‌స్టేట్‌ ఇన్సూరెన్స్ ‌కార్పొరేషన్‌ 2018 ‌లోనే రామగుండంలో వంద పడకల అధునాతన హాస్పిటల్‌ని నిర్మించాలని సంకల్పించింది. ఆ మేరకు ఎంప్లాయిస్‌ ‌స్టేట్‌ ఇన్సూరెన్స్ ‌కార్పొరేషన్‌ ‌కేంద్ర కార్యాలయం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ 20.09.2018 న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

తదనంతరం ఇఎస్‌ఐ ‌ప్రాంతీయ కార్యాలయం పలుమార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని తక్షణమే భూమి కేటాయించాలని ఉత్తరాల ద్వారా కోరింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అంతే కాదు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖఇ ప్రాజెక్టులకు సంబంధించిన ఇటీవల మే నెలలో నిర్వహించిన సవి•క్షా సమావేశలో కూడా రామగుండంలో 100 పడకల హాస్పిటల్‌ ‌నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపులో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న తీవ్ర జాప్యం గురించి చర్చించడం జరిగింది. భూ కేటాయింపులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని రామగుండం పరిసర పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, వి•రు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని సత్వరమే రామగుండం హాస్పిటల్‌ ‌నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని కిషన్‌ ‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page