రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు

సిఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు
కెటిఆర్‌కు రాఖీ కట్టిన బిఆర్‌ఎస్‌ ‌మహిళా నేతలు
చెల్లెలు కవితతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కెటిఆర్‌
‌మహిళలకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

image.png

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు ఘనంగా కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లో నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి మంత్రి సీతక్కతో పాటు పలువురు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సీతక్కతో పాటు ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్‌ ‌చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత, తదితరులు రేవంత్‌ ‌రెడ్డికి రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన మహిళా నేతలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. సోదరీ సోదరుల మధ్య అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ఆమె వి•డియాతో మాట్లాడుతూ.. రాఖీ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మాయిలను గౌరవించుకోవాల్సిన అవసరాన్ని రాఖీ పండుగ చాటి చెబుతుందన్నారు. మహిళా భద్రతకు పాటుపడదామని రాఖీ పండుగ సందర్భంగా అందరూ ప్రతినభూనాలన్నారు. మహిళలను గౌరవించు కోవడం మన సంస్కృతి అని అన్నారు. ప్రతి అడపడుచు, అన్నదమ్ములతో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుకునే పండగ రాఖీ పండగ అని అన్నారు. సోదరులు అందరూ బాగుండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుందని తెలిపారు. సమాజంలో వస్తున్న రకరకాల మార్పులు వల్ల మహిళల పట్ల అనేక రకాల హింస జరుగుతుందన్నారు.
ప్రతి సోదరుడు తన సోదరికి సమాజంలో ఎలా సెక్యూరిటీ, గౌరవం పొందాలి అనుకుంటారో.. అలాగే ప్రతి ఒక్కరూ తమ అక్క చెల్లమ్మల మాదిరి సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలని అన్నారు. ప్రతి మహిళను మన ఇంటి బిడ్డగా చూస్తే అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగవన్నారు. ఆడబిడ్డలకు స్వేచ్చగా తిరేగే అవకాశం ఇద్దాం.. ఎదగనిద్దాం అంటూ అందరికీ రాఖి పండగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంకు కూడా రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపానని.. చాలా సంతోషంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇక తెలంగాణ భవన్‌లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మహిళా నేతలు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, ‌మాజీ ఎంపీ మాలోత్‌ ‌కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ విప్‌ ‌గొంగిడి సునీత, ఇతర నేతలు కేటీఆర్‌కు రాఖీ కట్టి హారతిపట్టారు. మాజీ మంత్రి సత్యవతి..అక్షింతలు వేసి కేటీఆర్‌ను ఆశీర్వదించారు.  రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖలు కూడా రాఖీ వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌.. ‌జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో ఆవేదనతో కూడిన పోస్ట్ ‌చేశారు. తన సోదరి కవిత ఈ రోజు తనకు రాఖీ కట్టలేకపోవచ్చునని, కానీ ఆమెకు ఏ కష్టమొచ్చినా తాను ఎళ్లవేలలా అండగా ఉంటానని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ‘ఈ రోజు నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నీకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటా’ అని ఆయన పోస్ట్ ‌చేశారు. ఈ పోస్ట్‌కు లవ్‌ ‌సింబల్‌ను జతచేశారు. గతంలో సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫొటోను షేర్‌ ‌చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పార్టీ మహిళా నేతలు హరీష్‌ ‌రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండుగ అని చెప్పారు. పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల శ్రేయస్సు, భద్రత కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page