రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో

మారిపోనున్న సంగారెడ్డి దశ
•జగ్గారెడ్డి ఉద్యమ ద్రోహి
•రైతు బంధు ఉండాలంటే బిఆర్‌ఎస్‌ ‌గెలవాలి
•చింతా ప్రభాకర్‌ను గెలిపించండి
•సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌సంగారెడ్డి హైదరాబాద్‌లో అంతర్భాగం అవుతుందని, సంగారెడ్డికి మెట్రో వొస్తే స్థానిక ప్రజల దశ మారిపోతుందని, మొదటి దశలో ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో వొస్తే…రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో  వేయవచ్చునని సిఎం కెసిఆర్‌ అన్నారు. సంగారెడ్డి తాను పుట్టిన గడ్డ..తన జిల్లాఅని, గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌ని ఓడగొట్టినా తాను ఏమి అనలేదని, కారుని గుద్దిన, నా వోట్లు నేనే గుద్దుకున్న అన్న ఎమ్మెల్యే కావాలా..అని ప్రజలు ఆలోచించాలని అన్నారు. సోమవారం సంగారెడ్డి బిఆర్‌ఎస్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ ‌మాట్లాడుతూ…ఈ ఉద్యమ ద్రోహి మొదట బిఆర్‌ఎస్‌ ‌లోనే ఉండే. ఆలోచించి వోటు వేయండని అన్నారు. ఎలక్షన్లు వొస్తుంటాయి..పోతుంటాయని, ప్రజల కోసం పని చేసే నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌పుట్టిందే తెలంగాణ కోసమని అన్నారు.

15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్‌ఎస్‌ అన్నారు. ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆంధ్రలో కలిపారని కెసిఆర్‌ ‌తెలిపారు. 58 ఏళ్ళు ఏన్నో గోసలు పడ్డామని, తెలంగాణ వొచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని అన్నారు. ఆలోచించి వోటు వేయాలని, వోటే ప్రజల వజ్రాయుధమని అన్నారు. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రైతు బంధు డబ్బులు దుబారా చేస్తున్నాడని అంటున్నాడని, రైతు బంధు ఉండాలంటే బిఆర్‌ఎస్‌ ‌గెలవాలని అన్నారు. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ 24 ‌గంటల కరెంట్‌ ‌వెస్ట్ అని మాట్లాడుతు న్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ‌వాళ్లు అధికారంలోకి వొస్తే ట్రాన్స్ ‌ఫార్మర్లు పేలిపోతాయని అన్నారు. మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చానని, రాహుల్‌ ‌గాంధీ, రేవంత్‌, ‌భట్టి విక్రమార్క ధరణి తీసేస్తామని అంటున్నారని అన్నారు. ధరణి తిసీస్తే రైతు బంధు రాదని, మళ్లీ దలారుల రాజ్యం వొస్తుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని అన్నారు. గవర్నర్‌ ‌వల్ల కాస్త లెట్‌ అయ్యిందని, అధికారంలోకి వొచ్చాక అది కూడా చేస్తామని తెలిపారు. 24 గంటల త్రాగునీరు వొచ్చే విధంగా ఆలోచిస్తున్నామని తెలిపారు. ఒక పార్టీ మత పిచ్చి పార్టీ..ఎంత సేపు మసీదులు తవ్వుదామా అంటూ…ప్రజల మధ్య లొల్లి పెట్టడమే వాళ్ళ పని అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్‌ ఎం‌దుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వొచ్చిందని కెసిఆర్‌ ‌ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్‌ ‌కొరోనా సమయంలో ఎన్నో సేవలు చేశాడని అన్నారు. 157 మెడికల్‌ ‌కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదని, వంద ఉత్తరాలు రాసినా ఒక్క నవోదయ స్కూల్‌ ‌కూడా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీకి వోటేస్తే మురికి కాలువలో వేసినట్టే అని అన్నారు. మార్చి తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. ఈ సభలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్‌, ‌రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ‌పట్నం మాణిక్యం, నరహరి రెడ్డి, బుచ్చిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page