రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన. సిఐ నాగరాజురెడ్డి
భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : రాష్ట్రంలోని తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న రోటరీక్లబ్ లు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిందిగా రెండు రాష్ట్రాల రోటరీ గవర్నర్ డా. బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రోటరీక్లబ్ ఆఫ్ రివర్సైడ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో రోటరీక్లబ్లు చేసిన సేవలు, పథకాల ప్రచారం చేపట్టడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన భద్రాచలం సర్కిల్ ఇన్సెస్పెక్టర్ సి. నాగరాజురెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ సేవలు అభినందనీయమని, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు, త్రాగునీరు, చేతులు శుభ్రపరచుకునే బేషిన్ల ఏర్పాటు, బాలికలకు సైకిళ్ళ పంపిణీతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల డయాలసిస్ సెంటర్లు, వైద్యశిబిరాల నిర్వహణ చేపడుతున్నారని కొనియాడారు. అలాగే రోటరీక్లబ్ల ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నేరాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను నియంత్రణకు, మత్తు పదార్థాల నిర్మూలనకు, న్యాయ సేవా సదస్సు తదితర అవగాహనా కార్యక్రమాలను రోటరీక్లబ్ ద్వారా విస్తృతంగా చేపట్టి సమాజంలోని ముఖ్యంగా యువకులను చైతన్య పరచాలని సిఐ నాగరాజు రెడ్డి పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో రోటరీ సభ్యులు : డా. రమేష్‌బాబు, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూక్యా శ్రీనివాస్, భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ కామేశ్వరరావు, రోటరీ సభ్యులు గంజి సంపత్, మంగళగిరి హనుమంతరావు, గుండె రామారావు, ధారా రాము, వైఎన్ రెడ్డి, దేవంగి రామచంద్రరావు, ఐతంరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.