హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్ ఫజల్ అలీ సూసైడ్ చేసుకున్నారు. కూతురు ముందే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేటు బ్యాంకు లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.మంత్రి సబితా ఎస్కార్ట్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఫజల్ అలీ ఉదయం కూతుర్ని తీసుకొని డ్యూటీకి వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్ వద్ద కూతురు ముందే తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక తన తండ్రి సూసైడ్ చేసుకున్నాడని ఫజల్ కూతురు వెల్లడించారు. ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రూ. 3 లక్షలు లోన్ తీసుకున్నట్లు చెప్పిన ఆమె.. డబ్బుల విషయమై బ్యాంకు రికవరీ ఏజెంట్లు వేధించారని చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఫజల్ కూతుర్ని ఓదార్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు