ల్బీనగర్ ను నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ఎన్నికల్లో తనకు ఒక ఛాన్స్ కల్పిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మనసురాబాద్ డివిజన్లో జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, చంద్రపురి కాలనీ, సహారా ఎస్టేట్ కమ్యూనిటీ హాల్లో కాలనీ  సభ్యులతో సమావేశమాయ్యారు. అనంతరం లలిత నాగలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో సుధీర్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నాడని, అధికార యంత్రాంగంతో మీ కాలనీ ప్రెసిడెంట్లను బెదిరించిన విధంగా, నా కార్యకర్తలను, అనుచరులను కూడా బెదిరించాలనుకున్నడని, దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యయుతంగా నన్ను ఎదుర్కోవాలని హితబోధ చేశారు. ప్రజలు మౌనాన్ని వీడి ఓట్లతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం బిజెపి చేస్తుందని తద్వారా బిఆర్ఎస్ గెలుపుకు సహకరిస్తుందని, దొరల పాలన,రౌడీల పాలనకు స్వస్తి పలకాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిస్తే ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే అవకాశం ఉంది. తద్వారా నాకున్న దేశ విదేశీ పరిచయాలతో నియోజకవర్గానికి దేశంలోనే అన్నిటికంటే అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఆవాసయోగ్య ఆరోగ్య నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ మాధవి, డివిజన్ ప్రెసిడెంట్ బుడ్డ సత్యనారాయణ, కాలనీ అసోసియేషన్ బృందం, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page