మహిళల వివాహ వయస్సు 21 పెంచాలి..
కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచితే ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరతారని SBI నివేదిక వెల్లడించింది.
ఇటీవలSBI చేసిన రీసెర్చ్ దాని నివేదిక ప్రకారం, ఎక్కువ మంది మహిళలు వృత్తులకి సంబందించిన ఉన్నత విద్య అభ్యసించాలి అంటే మహిళల కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు పెంచాలని వెల్లడించింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలించేదిగా వుంది. కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, లేబర్ పవర్ పెంచాలి అంటే మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచితే మేలని •దీ× నివేదిక పేర్కొన్నది. ‘‘మహిళల చట్టబద్ధమైన వయస్సును పెంచడం వలన భారతదేశంలో (MMR) తల్లి మరణాల రేటుని తగ్గించే అవకాశం ఉందని, ఎక్కువ మంది స్త్రీలు గ్రాడ్యుయేషన్ చేయడం వలన లేబర్ ఫోర్స్ లోకి మహిళలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి అని SBI నివేదిక తెలిపింది. మరొక ప్రయోజనం కూడా వుంది దీని వలన చట్టబద్ధమైన వివాహ వయస్సు పురుషులు మహిళలకు సమానంగా ఉంటుంది అనిSBI నివేదిక పేర్కొంది.
ప్రతిపాదిత కనీస వివాహ వయస్సు 18 గా ఉన్నప్పటికీ, ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఇద్దరు మహిళలో ఒకరు 18 సంవత్సరాల కంటే ముందే వివాహం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇక్కడ దాదాపు సగం మంది మహిళలు వివాహ వయస్సు కంటే ముందే వివాహం చేసుకున్నారు.
మహిళల భాగస్వామ్యం లేబర్ ఫోర్స్ లో అతి తక్కువ వున్నా దేశం భారత్.
ప్రపంచ బ్యాంకు ప్రకారం, లేబర్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యం పరంగా భారతదేశం అత్యంత కింది స్థానంలో వున్నా దేశంగా ఉంది. మహిళా లేబర్ భాగస్వామ్య రేటు 20% గా వుంది. ఇది యుద్ధం వలన దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ కంటే చాలా స్వల్ప ఆధిక్యం. మహమ్మారి కారణంగా భారత్ లో మహిళా లేబర్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యం మరింత దెబ్బతింది.
((CMIE) సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం, కోవిద్-19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ వలన స్త్రీ పురుష లేబర్ పవర్ ను ప్రభావితం చేసింది. అయితే ఈ ప్రభావం పురుషలకి అనుకూలంగా పరిణమించింది. దిగజారుతున్న లేబర్ మార్కెట్ పరిస్థితులలో భారత మహిళలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ‘‘2019-20లో లేబర్ ఫోర్స్ లో మహిళలు 10.7 శాతం ఉన్నారు. అయితే లాక్డౌన్ దెబ్బకి మొదటి నెల అయిన ఏప్రిల్ 2020లో మహిళలు 13.9 శాతం ఉద్యోగ నష్టాలను చవిచూశారు. నవంబర్ 2020 నాటికి, పురుషులు చాలా వరకు కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి పొందారు. కానీ మహిళల విషయంలో ఇలా జరగలేదు. నవంబర్ నాటికి ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 49 శాతం మంది మహిళలే వున్నారు.లాక్ డౌన్ తర్వాత పునరుద్ధరణ పురుషుల కంటే మహిళలకు తక్కువ ప్రయోజనం చేకూర్చింది. ఇది లేబర్ ఫోర్స్ లో స్త్రీల భాగస్వామ్యం మరింత తక్కువగా ఉండటానికి దారితీసింది అనిCMIE నివేదిక పేర్కొంది.
చట్టపరమైన వివాహ వయస్సును పెంచడం వలన సామాజిక-ఆర్థిక అంశాలు మెరుగుపడతాయా..?
డిసెంబర్లో, పురుషుల చట్టబద్ధమైన వయస్సుతో సమానంగా మహిళల వివాహ వయస్సును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచడానికి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, ప్రతిపక్ష పార్టీల నుండి ప్రతిఘటన తర్వాత, అదనపు పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపారు. చట్టబద్ధమైన వివాహ వయస్సు పెంపు సామాజిక ఆర్థిక అంశాల పరంగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు ప్రజల సామాజిక సాంస్కృతిక ప్రవర్తనను మార్చడం చాలా కష్టమైన విషయం అని SBI నివేదిక పేర్కొంది. UNICEF ప్రకారం, భారతదేశం అత్యధిక బాలికా వధువులకు నిలయంగా ఉంది. గత నాలుగు దశాబ్దాల నుండి మహిళలకు చట్టబద్ధమైన వయస్సు 18 సంవత్సరాలు అమలు అవుతున్నప్పటికీ ఈ పరిస్థితి వుంది. చట్టబద్ధమైన వివాహ వయస్సును పెంచడం వల్ల ప్రసూతి మరణాల రేటును యుక్తవయస్సులో గర్భం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి అని ప్రభుత్వ సమర్ధకులు వాదిస్తున్నారు. ముఖ్యంగా పేద ఆరోగ్య పరిస్థితి ఉన్న రాష్ట్రాల్లో సామాజిక సాంస్కృతిక మార్పు పెద్ద ఎత్తున ఉంటే తప్ప మహిళల పరిస్థితి మెరుగుపడదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.పాత చట్టం 18 ఏళ్ళ వివాహ వయసు ఉన్నప్పటికీ, 20-24 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి నాల్గవ మహిళల్లో ఒకరు18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్నారని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.
– ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్