వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ల మొదటి రోజులో భాగంగా వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజలను రైతులను ముఖ్యంగా నిరుద్యోగ యువతను తీరని మోసానికి గురి చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ మైనార్టీలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏ విధంగానైనా గద్దె దించాలని పట్టుదలతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఉందని కాంగ్రెస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ భీమా వ్యక్తం చేశారు.ఎంపీ రంజిత్ రెడ్డి 300 కోట్లు దాన కుంభకోణం చేశాడు.చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి 300 కోట్ల దాన కుంభకోణం బయటికి తీస్తాం అని వికారాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.కోళ్ళ దాన కుంభకోణంలో 3వేల కోట్ల కుంభకోణం చేసిన డబ్బులను వికారాబాద్ లో ఖర్చుపెడుతుండు. పంచుతున్నాడు అని పేర్కొన్నారు.ఎన్నికల తర్వాత ఎంపీ ఉండడు ఎమ్మెల్యే ఉండడు వాళ్ల పెద్దసారే ఒప్పుకున్నాడు అని అన్నారు.ఎన్నికల్లో గెలిస్తే సేవచేస్తాం లేదంటే ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటామని కెసిఆర్ నీవు ఎక్కడ పండుకున్న రేవంత్ రెడ్డి  వదలడు కేసీఆర్ తిన్న లక్ష కోట్లు కక్కిస్తాడు అని మండిపడ్డారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆనంద్ స్థానికత గురించి మాట్లాడుతుండు  ఆయనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలువనట్లుంది ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు అని పేర్కొన్నారు. అలాగయితే ఆనంద్ కేరెళ్లిలో సర్పంచ్ గా పోటీ చేయాలే ఎమ్మెల్యే గా కాదు అని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా విజయావకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పథకాలే అభ్యర్ధులను గెలిపిస్తాయి అనారు.వికారాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తున్నాం వికారాబాద్ లో గెలుపు నాదే కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్ అని పేర్కొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page