వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: ప్రభుత్వ డాక్టర్ గా చిన్న పిల్లల వైద్యులుగా పేద ప్రజలకు సేవా చేస్తూ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని మరింత సేవా చేయడానికి రాజకీయాల్లోకి రావాలని కుంటున్నానని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ తుప్ప ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశం డాక్టర్ తుఫా ఆనంద్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ టి ఆనంద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లోనే టీఆర్ఎస్ టికెట్ తనకే నని ఓ మంత్రి ప్రకటించి అనువార్య కారణాలతో నాకు టికెట్ రాలేదు అని పేర్కొన్నారు.
గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అంతా నాన్ లోకల్…నేను నిఖార్సైన వికారాబాద్ బిడ్డను అని మా నాన్న మోమిన్పేట్ సర్పంచిగా ప్రజలకు సేవలు అందించి ప్రజల మెప్పు పొందిన నాయకుడని పేర్కొన్నారు. మా నాన్న తుప్ప రామయ్య పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో తనకు రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతో ప్రజల్లోకి వస్తూ సేవలందిస్తున్నానని తెలిపారు. అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని ఈసారి తనకు టికెట్ రావడం ఖాయమని పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అహంకారంతో పార్టీ నాయకులను పార్టీ అభిమానులను పార్టీకి దూరం చేస్తూ బిఆర్ఎస్ పార్టీని ఓడించే పరిస్థితి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అధిష్టానం నిర్వహించిన సర్వేలో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద అధిష్టానం వద్ద పూర్తి రిపోర్టు ఉందని తనకు టికెట్ రావడం ఖాయం అని పేర్కొన్నారు.
నాకు బీఆర్ఎస్ టికెట్ రాకున్నా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గెలిచి బీఆర్ఎస్ లో చేరి పనిచేస్తా అని తెలిపారు. ఈ సారి బీఆర్ఎస్ తప్పకుండా టికెట్ తనకే వస్తుందనే నమ్మకం నాకుంది అని తెలిపారు. ఇప్పటికే అధిష్టానం టికెట్ల మొదటి లిస్టును ప్రకటించిందని ఫేక్ న్యూస్ లో ప్రకటిస్తున్నారని అది నిజం కాదని అధిష్టానం టికెట్లు కేటాయిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారని తెలిపారు. ఎవరికి వారు ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు టికెట్ తనకు కేటాయించడం జరిగిందని మోసపూరితంగా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఎలాంటి టికెట్లు కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సిట్టింగ్లకు టికెట్లు కేటాయిస్తామని చెప్పడం సరైనదే కానీ కొంతమంది సరిగ్గా పని చేయని ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ వ్యూహంతో ఉన్నారని తెలిపారు. ముందస్తుగా వారికి టికెట్లు రావని కేటాయిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని వారిని సముదాయించి కొత్తవారికి గెలుపు గుర్రాలకు అధిష్టానం టికెట్లు కేటాయించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతుందని ఆయన తెలిపారు.