ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 : ఈ నెల 17 న విజయభేరి సభ ఏర్పాట్లను మంగళవారం బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి,ఇబ్రహీంపట్నం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసి.శేఖర్ తో పాటు సీనియర్ నేతలు తుక్కుగూడ సమీపంలోని శ్రీనగర్ కాలనిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,కనివిని ఎరుగని రీతిలో విజయభేరి సభ 100 ఎకరాలలో జరుగుతుందని వారన్నారు.సుమారు 10 లక్షల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన నేతగా ఆమెకు గిఫ్ట్ గా రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గిఫ్ట్ గా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు వారు పిలుపు నిచ్చారు.ఈ సభకు పార్టీ అతిరథులు సోనియా గాంధీ,జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే,ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్,పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, తదితరులు హాజరు కానున్నట్టు తెలిపారు. రాష్టం నలుమూలల నుండి లక్షలాదిగా తరలి రావాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు.