వరంగల్ జిల్లా బైరంపల్లి లో 1948 సంవత్సరంలో రజాకర్ మూకలు జరిపిన దారుణ మారణకాండ వివరించేందుకు ఏ పదాలు పనికి రావు. అక్కడ జరిపిన ముకుమ్మడి అత్యాచారాలు, 18 మందిని నిలబెట్టి కాల్చివేయటం తెలంగాణ పోరాట చరిత్రలో ఒక విషాద ఘట్టం. ఎక్కడో గుల్బర్గా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ప్రజాకవి కాళోజీ ఈ ఘోరమారణ కాండపై ఆవేదన, ఆవేశాన్ని తన కవితల్లో వివరించారు.. ఆ కవిత ఈనాటికి ప్రజా హృదయంలో నిరంతరం ప్రతిధ్వనిస్తోంది.
హైదరాబాద్ రాష్ట్రాధీశుడు ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కబంధ హస్తాల నుండి విముక్తి కోసం రాష్ట్ర ప్రజలు 1906 నుండి 1948 వరకు జరిపిన విరోచిత పోరాటమే తెలంగాణ విమోచన ఉద్యమం. రెండు వందల సంవత్సరాల పాలన అణచివేతకు జరిపిన పోరాటం ఇది. వివిధ సంఘాలు పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, రచయితలు, కళాకారుల ప్రజాసంఘటిత పోరాటమిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, నిజామ్ సంస్థానంలోని ప్రజలకు మాత్రం లేకపోవడాన్ని నాటి ప్రజావాహిని జీర్ణించుకోలేక పోయింది. 75 ఏళ్ళకు పూర్వం నిజాం నిరంకుశత్వ పాలన అంతమొందించే లక్ష్యంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గుండెలు ఎదురొడ్డి నిర్విరామ పోరాటం సలిపిన సమరయోధుల త్యాగఫలమే నిజామ్ రాష్ట్రం భారతదేశంలో విలీనం. ఆనాడు ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారెందరో చరిత్ర పుటల్లో నిలిచిపోగా.. మరెందరో కాలగమనంలో కనుమరుగయ్యారు.
వీలైనంత మందిని స్ఫురణకు తెచ్చుకుని వారికి నివాళులర్పించే ప్రయత్నమిది ..
దేశమంతా 1947 ఆగస్ట్ 15 స్వతంత్ర సంబరాలు జరుగుతుంటే, నిజామ్ సంస్థానంలోని ప్రజలు బానిసత్వంలో కూరుకుపోయారు. నిజామ్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యాన్ని భారతదేశం లో విలీనం చేయకుండా రజాకర్లను ఉసిగొలిపాడు.నిజామ్ అండగా ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజకార్లు గ్రామాలపై పడి దోపిడిలు చేయడం, బంగారు నగలను దోచుకోవడం, ఇళ్ళు తగలపెట్టడం వంటి అకృత్యాలు చేస్తూ ప్రజలను రకరకాలుగా హింసించారు. దీనికి నిరసనగా రామానంద తీర్థ నాయకత్వంలోని ఆర్య సమాజం పల్లెపల్లెనా ఉద్యమాలు చేయటం ప్రారంభించింది. మరొక పక్క కమ్యూనిస్టుల అధ్వర్యంలో సాయధ పోరాటాలు ఉదృతం అయ్యాయి. నల్గొండలో ప్రారంభమయిన ఈ ఉద్యమం శరవేగంగా నిజామ్ సంస్థానం అంతటా కార్చిచ్చులా విస్తరించింది. రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, సురవరం ప్రతాప్ రెడ్డి, దాశరధి రంగా చార్యులు, కృష్ణమాచార్యుల సోదరులు, వట్టికోట ఆళ్వార్ స్వామి, ఆరుట్ల కమలా దేవి, మల్లు స్వరాజ్యం, కాళోజీ నారాయణరావు, షోయబ్ ఉల్లా, మాడపాటి హనుమంతరావు తదితరులు లెందరో ఈ మహోద్యమం లో పాల్గొని మాతృదేశ రుణం తీర్చుకున్నారు.

తెలంగాణ విమోచన ఉద్యమానికి బీజాలుపడ్డ నల్గొండ జిల్లాలోని పోరాట యోధుల గురించి ఎంత చెప్పినా తక్కువే. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఎందరో పోరాట యోధులు నిరంకుశ నిజామ్ కు , రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటిగా నిజామ్ సైన్యం తూటాకు అమరుడు అయిన వ్యక్తి దొడ్డి కొమరయ్య. విసనూరు ప్రాంతంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగింపు, పోరాటం వేలాది మందికి స్ఫూర్తినిచ్చింది. జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు మల్లారెడ్డి గూడెం. ఖాసీం రజ్వీ నిరంకుశ విధానలకు ఎదురుఒడ్డి పోరాడిన చరిత్ర మల్లారెడ్డి గూడెం పోరుబిడ్డలది. చిన్న పిల్లలు సైతం ఇక్కడ వరిసలతో రాళ్లు రువ్వి నిజామ్ నిరంకుశత్వాన్ని అణచివేసేందుకు ఒక్కటై కదిలారు. 1946 డిసెంబర్ 1 న నిజామ్ మిలటరీ ఆకస్మాత్తుగా గ్రామం పై జరిపిన దాడిలో అప్పిరెడ్డి, నందిరెడ్డి నర్సిరెడ్డి, అలుగుల వీరమ్మ మరణించారు. వందలమంది గ్రామస్తులను చిత్ర హింసలకు గురి చేసింది నిజామ్ సైన్యం. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు వెంకట నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, కొండవీటి సత్తిరెడ్డి, కొడతా నారాయణరావు, రేణికుంట రామిరెడ్డి తదితరులు ఎందరో నిజామ్ పాలనకు వ్యతిరేకంగా పోరు సలిపారు.
నిజామ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఉద్యమంలో రాంజీగోండ్ , కొమరం భీమ్ పాత్ర అమోఘం. రామ్ జి గోండ్ తో పాటూ, అతని వెయ్యి మంది అనుచరుల్ని సామూహికంగా మర్రి చెట్టుకు ఉరి తీశారు. కాలక్రమంలో ఇది వేయి ఊరుల మర్రిగా కీర్తి గాంచింది. నిర్మల్ కేంద్రంగా ఎందరో పోరాట యోధులు రజాకర్లను ఎదిరించారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో గోపిడి గంగారెడ్డి, గంగిశెట్టి విఠల్ రావు, రాంపోసేట్టి, భీమ్ రెడ్డి తదితరులు ప్రాణాలు కోల్పోయారు. నిజామ్ సంస్థానంపై పోలీస్ చర్య ప్రారంభమయి విమోచన పూర్తి అయ్యే వరకు ఆసిఫాబాద్ వాసులు ప్రాణాలను పణంగా పెట్టి, అలుపెరుగని పోరాటం చేసి రజాకర్లను ముప్పు తిప్పలు పెట్టారు.
నిజామ్ పోలీసుల చిత్రహింసలను కారాగార వాసాన్ని లెక్కచేయకుండా మెదక్ జిల్లాకు చెందిన యోధులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న మెదక్ వాసి చోళ లింగయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనటమే కాక తనకున్న పరిజ్ఞానంతో రజాకర్ల దాడులను తిప్పికొట్టేందుకు ప్రయత్నించాడు. వెల్దుర్తి నారాయణరావు తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. ఆగస్ట్ 15న నిజామ్ ప్రభుత్వం ఆజ్ఞలను ధిక్కరించి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఎగరవేసారు. ఉద్యమ కారులు ఆయుధాలు పట్టి రజాకర్లను పలు ప్రాంతాలలో ఎదుర్కొన్నారు..

తెలంగాణ విమోచన, సాయుధ పోరాటానికి కరీంగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలం, మహ్మదాపూర్ గ్రామానికీ ప్రత్యేక స్థానం ఉంది. నిజామ్ నిరంకుశ పాలన, రజాకర్ల ఆగడాలు భరించలేని ఈ ప్రాంత ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తిమ్మాపూర్ మండలం, పొలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి నాయకత్వంలో ప్రజాసైన్యం 1946 మార్చి 14న మహ్మదాపూర్ చేరుకోగానే నిజామ్ సైనికులు అత్యంత పాశవికంగా వారిని మట్టుబెట్టారు. జిల్లాలో మంథనికి చెందిన రఘునాధ రావు మొట్టమొదటి సత్యాగ్రహుడిగా చరిత్ర సృష్టించారు. నిజామ్ పాలనకు చరమ గీతం పాడేందుకు మంథని నుంచి అనేకమంది సమర యోధులు ప్రాణాలు లెక్కచేయకుండా ముందు ఉండి పోరాటాన్ని సాగించారు.
రావి నారాయణరెడ్డి పిలుపుతో పనకంటి కిషన్ రావు, యెలిశెట్టి సీతారాం, డి. రాజన్న, సువర్ణ ప్రభాకర్ తదితరులు ఎందరో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు గడ్డపై రజాకర్లను ఎదిరించిన తొలి వ్యక్తిగా బత్తిని మొగలయ్య గౌడ్ చరిత్రలో నిలిచిపోయాడు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రాణాలకు తెగించి ఊరూరా త్రివర్ణ పతాకాలు ఎగరేస్తూ దేశభక్తిని చాటుకున్న మొగలయ్య గౌడ్ వరంగల్ తూర్పు కోటలో 1946 ఆగస్ట్ 11న రజాకర్ల హింసకు గురయి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రజాకర్ల వ్యతిరేక ఉద్యమం వరంగల్లుల్లో ఉధృతం అయింది. వరంగల్ జిల్లా బైరంపల్లి లో 1948 సంవత్సరంలో రజాకర్ మూకలు జరిపిన దారుణ మారణకాండ వివరించేందుకు ఏ పదాలు పనికి రావు. అక్కడ జరిపిన ముకుమ్మడి అత్యాచారాలు, 18 మందిని నిలబెట్టి కాల్చివేయటం తెలంగాణ పోరాట చరిత్రలో ఒక విషాద ఘట్టం. ఎక్కడో గుల్బర్గా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ప్రజాకవి కాళోజీ ఈ ఘోరమారణ కాండపై ఆవేదన, ఆవేశాన్ని తన కవితల్లో వివరించారు.. ఆ కవిత ఈనాటికి ప్రజా హృదయంలో నిరంతరం ప్రతిధ్వనిస్తోంది. ఖమ్మం జిల్లా ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో నిజామ్ నిరంకుశ పాలనపై, రజాకర్ల ఆకృత్యాలపై జరిపిన పోరాటం చరిత్రాత్మకం. ప్రజా ఉద్యమ దళాలకు తుమ్మ శేషయ్య, పాటి జంగయ్య, దామినేని వెంకటేశ్వరరావు, సుంకరి మల్లయ్య తదితరులు నాయకత్వం వహించి పోరు సలిపారు. జమలాపురం కేశవరావు ఉద్యోగాన్ని త్యజించి నిజామ్ వ్యతిరేకంగా పోరాడారు. స్వచ్చంద దళాలు ఏర్పాటు చేసి బొమ్మకంటి సత్యనారాయణరావు మత దురహంకారులైన రజాకర్లపై దాడులు జరిపి ప్రజాపక్షాన నిలిచారు.

1947 అక్టోబర్ 7న తెలంగాణను భారతదేశలో విలీనం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు, అమరచింత, అప్పంపల్లి గ్రామాల్లో బెల్లం నాగన్న నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైంది. నెల్లికొండ, వడ్డెమాన్, దాసరిపల్లి, లంకాల తదితర గ్రామాలకు చెందిన రెండు వేల మంది తెలంగాణ విమోచనకు సత్యాగ్రహం చేసారు. సత్యాగ్రహాన్ని అణచివేసేందుకు ప్రయత్నించి విఫలమైన నిజామ్ సైనికులు ఆ సాయంత్రం ఉద్యమ కారులపై జరిపిన కాల్పులలో పదకొండు మంది మరణించారు, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కుల కిష్టన్న తన ఇంటి పై జాతీయ పతాకాన్ని ఎగరవేసాడు. నిజామ్ పోలీసుల కళ్లుకప్పి సమరయోధులు మహబూబ్ నగర్ పట్టణం తూర్పు కమాన్ పై జాతీయ జండా ఎగరవేశారు. నారాయణపేట ఆర్యసమాజ నాయకులు సీతారామాంజనేయ గ్రంధాలయ ఉద్యమ నాయకులతో జడ్చెర్ల లో ఖండేరావు, కొడంగల్లో గుండుమల గోపాల్ రావు, కల్వకుర్తిలో లింగారెడ్డి, వనపర్తిలో శ్రీహరి, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశం తెలంగాణ విమోచన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ఇందూరు నిజాం వ్యతిరేక పోరాటంలో ముందు నిలిచింది. ఆర్యసమాజ స్ఫూర్తితో రజాకర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన కిషన్ యోధానిని కాల్చి చంపడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. వందలాది తెలంగాణ పోరాటయోధులను నిజామాబాద్ ఖిల్లా జైలులో బంధించి అనేక చిత్రహింసలు పెట్టారు. ఈ జైలు వందలాది మంది ఉద్యమకారుల మరణానికి మూగ సాక్షి నిలిచింది. దీనిని రాజకీయ ఖైదీల బొందలగడ్డ అని నిజామ్ ప్రకటించడం గమనార్హం. నిజామ్ ను వ్యతిరేకించి ఇదే ఖిల్లా జైలులో బందీ అయిన దాశరథి కృష్ణమాచార్యులు నిజామ్ కర్కశత్వానికి బలవుతున్న పీడిత ప్రజల గొంతుగా మారి కవితలల్లి వారిని చైతన్య పరిచారు. అనాడు బొగ్గుతో జైలు గోడలపై రాసిన కవిత్వ చరణాలు నేటికీ జనంలో ప్రతిధ్వనిస్తునే ఉన్నాయి. బాన్స్వాడ కు చెందిన లక్క కిట్టయ్య నిజామ్ ను ప్రత్రిఘటిస్తూ రజాకర్లకు వ్యతిరేకంగా నిర్వహించిన సాయుధ ప్రదర్శన అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామంలో సుంకు కిష్టయ్య నిజామ్ వ్యతిరేక పోరుకు నాయకత్వం వహించాడు. జిల్లాలో మారుమూల గ్రామం మాదాల ప్రజానీకం తెలంగాణ విముక్తి కోసం రజాకర్లనెదిరించి పోరాడేందుకు స్వయంగా తుపాకులు, తూటలు మందుగుండు సామగ్రి తయరు చేసుకోవడం వారి తెగింపునకు తార్కాణం. ఈ మాదాల ఆర్మూర్, కామారెడ్డి, సిర్పూర్ ప్రాంతాలకు కేంద్ర బిందువుగా అలరారింది.
హైదరాబాద్ ప్రాంతంలో వందేమాతరం రామచంద్రరావు, నారాయణ పవార్, గంగరామ ఆర్య, జగదీష్ ఆర్య, కొక్కుడాల జంగారెడ్డి, ఆర్ కేశవులు, కాటం లక్ష్మీనారాయణ, షోయబ్ ఉల్లాఖాన్ ఆదిగాగల ప్రముఖులు ప్రజలలో చైతన్య వెలుగులు ప్రసరింపజేసారు. నారాయణరవు పవార్ నిజామ్ పై బాంబులు విసిరి సంచలనం సృష్టించారు. నిజాం కు వ్యతిరేకంగా పత్రికలో వార్తలు రాసినందుకు షోయబ్ ఉల్లాఖాన్ నడిరోడ్డుపై దారుణ మరణానికి గురయ్యారు, ప్రస్తుత రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులలో ఉన్న రాచకొండ గుట్టలను పోరాట యోధులు స్థావరంగా ఉపయోగించుకున్నారు. షాబాద్ ను కేంద్రం చేసుకున్న రజాకర్ల సైన్యంలో ఒక విభాగాన్ని ఒంటిచేత్తో ఎదుర్కొన్న ఘనత కిష్టయ్య జోషికి దక్కుతుంది. ఈ విధంగా తెలంగాణ ప్రాంతమంతటా నిజామ్కు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి ఉద్యం నిర్వహిస్తున్న సమయంలో కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయి పటేల్ పోలీసు చర్యకు ఉపక్రమించడంతో 1948 సెప్టెంబర్ 13న మొదలైన ఆపరేషన్ పోలో ఉధృతి సెప్టెంబర్ 17న నిజామ్ లొంగుబాటుతో విజయవంతంగా ముగిసింది. సరిగ్గా ఈ సంఘటనకు 75 సంవత్సరాలు. అందుకే వజ్రోత్సవమో, విమోచన ఉత్సవమో, స్వాతంత్య్ర ఉత్సవమో.. ఏదైతెనేం..
– అద్దంకి శ్రీరామకుమార్, 94405 67625, ఆకాశవాణి వార్తావిభాగం, విశ్రాంత పాత్రికేయుడు, హైదరాబాద్