వృద్ధాప్యవు క్రీనీడల
మాటున ఎన్నోవెతలు
ఎముకలు కుళ్ళీన వయస్సు
మళ్ళిన సజీవనా చిత్రాపటం.!
కనుబొమ్మలమాటున దాగనీ
నీలినీడల స్కృతులెన్నో .
సడలిన శరీరపుకండలు కరిగి
ఎముకల గూడైన అస్తిపంజరం
రక్తంచెడి ఓపిక నశించి ఏమీ
చేయలేక చేతగాని సోమరితనం..!
ముడతలు పడ్డ శరీరాన్ని
చూస్తూకదలని బ్రతుకు
బండికి దారి వెతుకుతూ !
ఆదరణ లేక ఆష్యాయతలేక
ఇసుమంత ప్రేమకై ఆల్లాడిపోతూ
గుక్కెడు నీటికైఅనుదినం
ఏడతెగని వయసుతో పోరాటం !
నరాలు పనిచేయకున్నా
అవయవాలు మాట వినకున్నా
పొట్టకోసం పడే కష్టం
పడనిపాట్లు లేవు..!
అనుక్షణం వెలుగు నిండిన కన్నులతో !
బ్రతుకు మీద తీపితో శూన్యంవైపు చూస్తూ.
ఆవేదన నిండి ఆర్త్రతతో మాటలు
రాక బాంధవ్యానికి అల్లాడిపోతూ….
జీరబోయిన కంఠంతో అక్రదన చేస్తూ ..
నిరాశను నిస్పృహను దుఃఖాన్ని
నీ బోసి నగువుల వెనుకదాచి
బతుకుబాటలో నడవని బండిని
లాగుతూ……!
ప్రయాసతో సాగి పోతున్న
వృద్ధ బాటసారి…
నీ…… జీవిత గమనంలో
మార్పుకు వెలుగు
నిం పేదెన్నడు…..!!
-శోభరమేష్
8978656327