హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ముంబైకి చెందిన టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ వెరానియం క్లౌడ్ లిమిటెడ్ తన వ్యాపార కార్యకలాపాల్లో అసాధారణ వృద్ధిని బుధవారం సాధించింది. మొత్తం ఆదాయం, నికర లాభాలలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. 2023 సెప్టెంబరుతో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో(హెచ్1) రూ.96.25 కోట్ల స్టాండలోన్ నికర లాభం ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో వచ్చిన రూ.26.37 కోట్లతో పోలిస్తే ఇది 265 శాతం అధికం. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో(హెచ్1) కార్యకలాపాల నుంచి మొత్తం ఆదాయం రూ.377.33 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో వచ్చిన రూ.123.55 కోట్లతో పోలిస్తే ఇది 205.4 శాతం అధికం. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఒక్కో షేరుకు ఈపీఎస్ రూ.22.44. ఇటీవల ఈవీఎల్ఐ ఎమర్జింగ్ ఫ్రాంటియర్ ఫండ్ అక్టోబర్ 11, 12 తేదీల్లో బల్క్ డీల్ ద్వారా కంపెనీలో మొత్తం 4.76 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీలో మొత్తం రూ.10.45 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 9 అక్టోబర్ నాటి బోర్డు సమావేశంలో కంపెనీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి అమెరికా, యూఏఈలలో అనుబంధ కంపెనీలను తెరవడానికి ఆమోదం తెలిపింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా వినాయక్ వసంత్ జాదవ్ నియమితులయ్యారు.