హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 05: వైశ్యుల వ్యాపారాభివృద్ధికి వాసవి బిజినెస్ గ్రూపు(వీబీజీ) సంస్థ చిరునామాగా మారిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. వీబీజీ సంస్థ ఆధ్వర్యంలో వైశ్యుల కోసం ప్రత్యేకించి ఆదివారం ఉచిత బిజినెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిధులుగా బండారు సుబ్బారావు, గుండా ప్రకాష్, ఆర్ఎస్ పీ బద్రినాథ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల్లోని వైశ్య వ్యాపారులు 300 లకు పైగా పాల్గొని వ్యాపారాభివృద్ధికి తీసుకోవాల్సిన పలు అంశాలపై చర్చించారు.
వైశ్యుల వ్యాపారాభివృద్ధికి అన్నీ ఒకే చోట లభించాలనే ఉద్దేశంతో 5 ఏళ్ల క్రితం వాసవి మాత ఆశీస్సులతో వీబీజీ సంస్థను స్థాపించినట్లు వ్యవస్థాపకులు టిఎస్ పీ.ప్రసాద్, మడిపడిగే రాజు తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుం లేకుండానే వైశ్య వ్యాపారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ వారు వ్యాపార అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన విధంగా ఇలాంటి బిజినెస్ మీట్స్ ద్వారా తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మారుతి, సంతోష్, సతీష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.