- క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ
- 5.68 లక్షల మందికి రూ. 115.33 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
- క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేసిన ఎపి సిఎం జగన్
వ్యవసాయరంగంలో తాము కొత్త ఒరవడిని తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు.2020-21 సీజన్ లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ. 45.22 కోట్లు, ఖరీఫ్ 2021 సీజన్ లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి రూ. 115.33 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. దీంతోపాటు… గోదావరి వరదలు, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ. 39.39 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తమది రైతులకు అండగా నిలబడే ప్రభుత్వమన్నారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని జగన్ విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం లేదని, సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టిందని అన్నారు. గత ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని కోరారు. రుణమాఫీకి చంద్రబాబు కేవలం రూ. 15 వేల కోట్లను మాత్రమే ఇచ్చారని.. వైసీపీ ప్రభుత్వం రూ. 25,971 కోట్లను ఇచ్చిందని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోగలిగితేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు క్రమం తప్పకుండా పరిహారం చెల్లిస్తోందని, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తే.. తమ ప్రభుత్వం మాత్రం రైతుల పక్షాన నిలబడిందని అన్నారు. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ, అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు పంటనష్టపోయిన రైతన్నలకు రూ.1834 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని సీఎం వెల్లడించారు. సన్నా, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. అందులో భాగంగా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన అన్నదాతలకు రూ.160.55 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, వైస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.200 కోట్లు వారి ఖాతాల్లోకి జమచేస్తున్నాం. మన అందరి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఇప్పటి వరకూ 21.31 లక్షల మంది రైతులకు రూ.1834 కోట్లు ఇచ్చాం. గత రబీ, ఖరీఫ్‌లో రుణాలు చెల్లించిన 8,22,411 రైతులకు రూ.160.55 కోట్లు ఇస్తున్నాం. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుని 73.88 లక్షల మంది రైతులకు రూ.1834.55 కోట్లు ఇచ్చాం. గతంలో పంటల బీమాలో రైతులు తమ వాటా తామే కట్టుకున్నారు. చంద్రబాబు హయంలో బీమాకింద చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. మన ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా అమలు చేసింది. రైతుల ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఈ మూడేళ్లకాలంలో రూ.6,685 కోట్లు చెల్లించాం. 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలోనూ నాణ్యమైన సర్ట్గి•డ్ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు లభిస్తు?న్నాయి. 9 గంటలపాటు క్వాలిటీ విద్యుత్‌ను మన ప్రభుత్వం పగటిపూట అందిస్తోంది. గత ప్రభుత్వం పాడిరైతులకు ఎలా అన్యాయం చేయాలని చూస్తే.. మన ప్రభుత్వం అమూల్ ద్వారా వారిని ఆదుకుందని సీఎం జగన్ అన్నారు.
అన్నదాతలకు అండగా నిలుస్తూ.. ఈ క్రాప్ ఆధారంగా రూ. లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతన్నలకు పూర్తి వడ్డీ మాఫీ చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. రైతు సంక్షేమం విషయం లో గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. రైతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు రైతుల పక్షాన నిలబడలేదని అన్నారు. ’రైతులకు ఇన్పుట్ సబ్సీడీలో కొత్త ఒరవడి సృష్టించాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లోనే చెల్లిస్తున్నాం. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. వరుసగా మూడో ఏడాది వైఎస్సాఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నాం. గతంలో వైస్సాఆర్ రైతు భరోసా వంటి పథకం లేదు. పంట రుణాలు ఏడాదిలో తీర్చిన రైతులకు పూర్తి రాయితీ ఇచ్చాం. చంద్రబాబు సున్నావడ్డీ పథకాన్ని ఎగ్గొట్టారు. చంద్రబాబు రుణమాఫీ కోసం కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చారు. కానీ మన ప్రభుత్వం రైతు భరోసా కింద 25, 971 కోట్లు ఖర్చు చేసింది. పంట కొనుగోలు సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. పంటల బీమాను ఉచితంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పంట అంచనాలు అశాస్త్రీయంగా ఉండేవి. మా ప్రభుత్వంలో ఈ-క్రాప్ విధానంలో రైతులకు సాయం అందిస్తున్నాం. రాష్ట్రంలో ఒక్క కరువు మండలం డిక్లేర్ చేసే పరిస్థితి లేదని సీఎం జగన్ వ్యాఖ్యనించారు.