శ్రీ ప్రసన్న ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనలొ పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ఆగస్ట్ 12: మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  శ్రీ ఆంజనేయ విగ్రహం, ధ్వజస్తంభం నవగ్రహల ప్రతిష్టాపనకు  తనవంతు గా  రూపాయలు 51 వేల విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. స్థానిక  ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా ఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ ను వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు టి సాయప్ప అధ్యక్షులు మునీందర్ ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి సభ్యుల శాలువా పూలమాలతో సత్కరించి ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నర్సింలు ముదిరాజ్ ఎస్ వెంకట్ రెడ్డి సంజీవరావు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page