పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 15: నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని
పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుడెం మహిపాల్ రెడ్డి కోరారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రేషన్ డీలర్ల, సోమ వంశీ ఆర్య క్షత్రియ సమాజం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా నిలిపామని తెలిపారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పేదలకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు రైతుబంధు రైతు బీమా తదితర పథకాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయనీ తెలిపారు. దీంతోపాటు రాబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఇంటికి కేసీఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరగబోతుందని తెలిపారు. దీని మూలంగా కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా పటాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచిందని అన్నారు. దశాబ్ది కాలంలో 9వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించామని అన్నారు.ఈ సందర్భంగా సోమ వంశీ ఆర్య క్షత్రియ సమాజం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. పటాన్ చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి అతీక్ ఆధ్వర్యంలోని బృందం ఆధ్వర్యంలో మళ్లీ జిఎంఆర్ ను కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.అనంతరం ఎల్ఐజి, మ్యాక్ సొసైటీలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు..
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, షకీల్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.