సబితా రెడ్డిని కలిసి పుశ్వగుచ్చం అందజేసిన మహేశ్వరం బిఆర్ఎస్ ఉద్యమ కారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్
కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 4 : సార్వత్రిక ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో విజయం సాధించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డిలు ఆమె నివాసంలో కలసి ఆమెకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా కాకి నరసింహ ముదిరాజ్ మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గం లో సబితా ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధి పనులు ప్రజలు మరువకుండా ముచ్చటగా మూడోసారి గెలిపించారని ఆయన అభిప్రాయపడ్డారు.సబితా రెడ్డి చేసిన అభివృద్ధి పనులే ఆమెను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని ఆయన తెలిపారు. సవితమ్మకు ఓటమి లేకుండా మహేశ్వరం గడ్డపై బిఆర్ఎస్ జెండాను ఎగరవేసిందని ఆయన పేర్కొన్నారు.నియోజకవర్గ ప్రజలు పూర్తిస్థాయిలో ఆమెకు అండగా నిలిచి గతంలో కంటే ఈ ఎన్నికల్లో మెజార్టీ భారీగా అందించారని ఆయన తెలిపారు.ఇప్పటికైనా ప్రజలు గ్రహించి సభితమ్మకు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రభుత్వంలో ఉన్న లేకున్నా సభ్యతమ్మ ద్వారా అభివృద్ధి పనులు సాధ్యం అవుతాయని ఆయన అన్నారు.