విద్యారంగాన్ని సంక్షోభాలలోకి నెట్టడం ప్రభుత్వాలకి కొత్త కాదు. ఉచిత విద్యను ప్రభుత్వబాధ్యతల నుండి తప్పించేందుకు ప్రభుత్వాలు చేసే అనేక చవకబారు ఎత్తుగడలను అమలు చేస్తూ వస్తున్నది. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కునారిల్లచేసే ప్రభుత్వంమీద సమగ్ర శిక్షా ఉద్యోగులుఉద్యమంప్రారంభించారు.
మన రాష్ట్రంలో ఇటీవలే కొన్ని శాఖల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 21600 మంది సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు ఇప్పటివరకూ రెగ్యులర్ కు నోచుకోలేక పోయారు.వీరు మండల విద్యా వనరుల కేంద్రంలో, పాఠశాల కాంప్లెక్స్ పరిధిలో,జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో, రాష్ట్ర సమగ్ర కార్యాలయంలో, కస్తూరి బాయి విద్యాలయాల్లో, మోడల్ స్కూల్స్ లో బోధన ,బోధనేతర సాంకేతిక సహాయకులుగా విధులు నిర్వహి స్తున్నారు. వీరు గత దశాబ్దకాలంగా తమ వృత్తిపర సమస్య లపై అనేక ప్రాతినిధ్యాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు అయినా ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించక పోగా అణచివేత ధోరణి అవలంభిస్తున్నది. ప్రధానంగా పాఠశాల లకు మండల విద్యా కార్యాలయానికి మధ్య అనుసం ధానకర్తలుగా కీలకమైన విధులు నిర్వహిస్తున్నారు. కాంప్లెక్స్ పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా విద్యాశాఖ గణాంకాలు క్షేత్రస్థాయిలో సేకరించడం,విద్యాశాఖతో సమన్వయం చేయడం వంటి పనులు చేస్తూన్నారు. అవస రమైన చోట పాఠశాలలో బోధన విధులు కూడా నిర్వహి స్తూ ఉంటారు.జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా రోస్టర్ కం మెరిట్ విధానంలో వీరినియమాకంజరిగిన కూడా వీరికి ఇంకా పర్మినెంట్ కాకపోవటం శోచనీయం.అదేవిధంగా ఎం.ఐ.ఎస్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఇదే విధానంలో నియామకం కాబట్టి రెగ్యులర్ వేతనాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు.
తమసమస్య పరిష్కారానికి ఉద్యమబాట పట్టకతప్పదని భావించి వారు ఈ నెల 4 నుండి 10 వరకు వివిధ జిల్లా కేంద్రాలలో వినూత్న నిరసన దీక్షల ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను ఏకరువు పెట్టారు.తమను రెగ్యులర్ చే యాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఆందోళన చేస్తున్నారు. సెప్టెంబర్ 11 నుండి నిరవధిక సమ్మె చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర సంబంధిత అధికారు లకు తమ సమ్మె నోటీసును అందజేశారు. వీరి ప్రధా నమైన డిమాండ్లు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అప్పటివరకూ వెంటనే కనీస వేతనం అమలు చేయాలనీ, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి.
ప్రతి ఉద్యోగి 25 లక్షలు సౌకర్యం కల్పిం చాలనీ, విద్యాశాఖ నియామకాల్లోప్రాధాన్యత కల్పిం చాలనీ, మహిళా ఉద్యోగులకు ఇవ్వాల్సిన సెలవులు,చైల్డ్ కేర్ లీవ్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నారు.స్పెషల్ ఆఫీసర్ పి.జి. మరియు బి.ఈడి అర్హతలతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కొన్ని చోట్ల జూనియర్ కళాశాలల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న వారికి ప్రిన్సిపాల్ పోస్టు కనీస మూల వేతనాన్ని వర్తింపచేయాలనీ, పి.జి.,సి.ఆర్. లు పి.జి., బి.ఈడి. అర్హతలతో 11,12 తరగతులకు బోధిస్తున్న ందున జూనియర్ లెక్చరర్లకు చెల్లిస్తున్న వేతన శ్రేణిలో మూల వేతనాన్ని చెల్చించాలనీ.సి.ఆర్.డి.లు డిగ్రీ మరియు బి. ఈడి.అర్హతలతో 6 నుండి 10వ తరగతులకు బోధిస్తూ స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నందున వారికి స్కూల్ అసిస్టెంట్ సమాన వేతనశ్రేణిలో కనీస మూల వేత నాన్ని చెల్లించాలనీ కోరుతున్నారు.పి.ఈ.టి. లు డిగ్రీ మరి యు బి.పి.యిడి.అర్హతలతో పాఠశాల మరియు జూని యర్ కళాశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నందున, ఇతర మేనేజ్ మెంట్ ల్లో మాదిరిగా పి.డి (ఆప్ గ్రేడ్) పోస్టుగా పరిగణించి,వారికి సమాన స్కేలులో మూలవేతనాన్ని చెల్లించాలనీ, అకౌంటెంట్లు డిగ్రీఅర్హతలతో పనిచేస్తున్న ందున సీనియర్ అసిస్టెంట్లకు సమానంగా మూలవేతనాన్ని చెల్లించాలనీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు బి.కామ్. కంప్యూటర్ అర్హతలతో పనిచేస్తున్నందున జూనియర్ అసిస్టెంట్ వేతనం చెల్లించాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్లు ఇంటర్ మరియు టెక్నికల్ టీచర్ కోర్స్ అర్హతలతో పనిచేస్తున్నందున సెకండరీ గ్రేడ్ మూల వేతనం చెల్లించాలి. ఎ.ఎన్.ఎం. పదవ తరగతి,నర్సింగ్ కోర్సు పూర్తి చేసినందున హెల్త్ అసిస్టెంట్ వేతనం చెల్లించాలనీ, ఇతర బోధనేతర సిబ్బంది పదవతరగతి మరియు ఆ లోపు విద్యార్హతలతో నియామకం అయినందున ఆఫీస్ సబార్డినే ట్‌వేతన శ్రేణిలో కనీస మూల వేతనాన్ని చెల్లించాలనీ, ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే విధంగానే వార్షిక ఇంక్రిమెంటు ఇవ్వాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.
సుప్రీంకోర్టు సమా నపనికి సమాన వేతనం చెల్లించాలన్న తీర్పును ప్రభుత్వం గౌరవించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ మేరకు పి. ఆర్.సి 2018 కమిషన్ నివేదికలో ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి కనీస వేతన స్కేలు మూల వేతనం అమలు చేయాలని చేసిన సూచన మేరకు తమకు కనీసవేతన స్కేలు ప్రభుత్వం అమలుచే యాలనే డిమాండ్లతో వారు రాష్ట్రవ్యాప్తంగా 11 నుండి నిరవధిక సమ్మెలో కి వెళ్లారు. ఇప్పటికే వీరి ఆందోళన వల్ల మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్రాలు మూతబడ్డాయి.శాలసిద్ది,మధ్యాహ్న భోజన పథకం రోజు వారి వివరాలు, విద్యార్థుల ఫేస్ ఐడెంటీ అటెండెన్స్ రిజిస్ట్రేషన్ తదితర వివరాలసేకరణ చతికిల పడ్డాయి. ఐదేళ్ళుగా ఎదురు చూసిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల నిర్వహణ ప్రారంభమైంది.ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయి సమాచార సేకరణ ,పాఠశాలలు,పాఠశాల సముదాయాలు, మండల విద్యా కేంద్రాల నుండి జిల్లా విద్యా కార్యాలయాలకు సమాచార అనుసంధానం, సాంకేతిక సహకారం తదితర కీలకమైన సమయంలో సమగ్ర ఉద్యోగులు సమ్మె ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేకపోలేదు.
– అజయ్ బాబు..
ఉపాధ్యాయులు