సార్” సేవలు చిరస్మరణీయం….

 

– నాటి వారి ఆలోచన.. ఆశయాలే… నేటి తెలంగాణ రాష్ట్రం.
– ఆచార్యుని ఆశయాలని నిరంతరం కొనసాగిసిస్తాం.. 

-సార్ మన మధ్య లేకున్నా… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..

-ఆచార్య జయశంకర్  జయంతి సందర్భంగా సిద్దిపేట లో విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించిన మంత్రి హరిశ్ రావు …

తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు అని మంత్రి హరీష్ రావు  అన్నారు.. ఆచార్య జయశంకర్  89వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు… ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ …జయశంకర్ సార్ ఎప్పుడు మాట్లాడే వారు… తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి అంటే నీళ్లు.. నిధులు.. నియామకాల లక్ష్యం చేరేందుకే అని అనేవారు…నేడు కాళేశ్వరం జలాలతో కోటి ఎకరాల మాగాణి గా చేసుకున్నాము.. నిధుల్లో దేశంలో నే ధనిక రాష్ట్రం గా దేశాన్ని సాదుతున్న మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ ఊతం ఇస్తున్నది.. నియమాకాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది.. మరో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం..అని మంత్రి హరీష్ రావు అన్నారు.” ఇది ఆచార్యుని కలలు కన్న నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది… నాడు జయశంకర్ సర్  తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అణువునవును చూసి అవమానం .. బాధను దిగమింగుతూ కేసీఆర్ కి ఎప్పుడు చెప్పే వారు.. అలాంటి వారి కల నేడు నెరవేరుతున్న సందర్భంలో వారు ఉంటే ఎంతో సంతోష పడే వారనన్నారు.. ఆచార్య జయశంకర్  టి ఆర్ ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కి కి చేదోడువాదోడుగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లో సూచనలు, సలహాలు అందించారన్నారు… ఆయన మన మధ్య లేకున్నా ఆయన పోరాటం పటిమ ,ఆయన తపన రాష్ట్ర సాధనలో అయన కృషి ఎవరు మర్చిపోలేరని చెప్పారు.. .2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి వచ్చిన ప్రకటన జయశంకర్ స్వయంగా రాసి కేంద్ర హోంశాఖ కు పంపిస్తే ఆనాడు కేంద్రము ప్రకటన చేసిందన్నారు….ప్రధాన మంత్రులకు, రాష్ట్రపతి లకు వినతిపత్రం ఇవ్వాలన్న శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ ఎందుకు ఇవ్వాలో చెప్పాలన్న ప్రతి అంశంలో జయశంకర్ సార్ ఉన్నాడు అని తెలిపారు… విద్యావంతులను,మేధావులను, ఉపాధ్యాయులను చైతన్య పరుస్తూ రాష్ట్రం కు జరుగుతున్న వివక్షను,రాష్ట్రం ఎందుకు అనే ఆవశ్యకతను వివరించిన వారు జయశంకర్ గారు అని.. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నామని… ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడలన్నపుడు తెలంగాణ కి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన దగ్గర నేర్చుకొని అసెంబ్లీలో బల్ల గుద్ది వాదించి చర్చించామని, ఆయన.. అదే అసెంబ్లీ లో నేడు ఒకటొకటిగా సాకారం చేసుకుంటున్నామని చెప్పారు.. వారికి ఎప్పుడు సీఎం కేసీఆర్ , ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.. వారి పేరు తో భూపాలపల్లి జిల్లా కు జయశంకర్ జిల్లా గా పేరు మార్చు కున్నాము, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం గా పేరు పెట్టుకున్నాము.. ఆయన ఆశయ సాధన , ఆయన జీవం మన మధ్యలో లేకపోయిన్నప్పటికి ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని…వారి ఆశయాలని కోసాగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page