సిద్ధిపేటకు మరో జాతీయ కీర్తి

• బెస్ట్ ‌టూరిజం ప్రాంతం గా చందల పూర్‌
•‌ జాతీయ టూరిజం లో మెరిసిన చందల పూర్‌
•‌ రంగనాయక సాగర్‌ ‌నెలవు మారిన చందలపూర్‌ ‌గ్రామానికి దక్కిన గుర్తింపు.
• తెలంగాణ రాష్ట్రం నుండి ఉత్తమ టూరిజం గ్రామాల ఎంపిక
• రాష్ట్రం నుండి రెండు గ్రామాలు ఎంపిక.. సిద్దిపేట నుంచి  చంద్లపుర్‌
•‌ గ్రామ ప్రజలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌, 26:‌సిద్దిపేట కు ఎన్నో జాతీయ అవార్డుల్లో ఆదర్శంగా నిలుస్తున్నది.. మరో గొప్ప  జాతీయ కీర్తి కి సిద్దిపేట ఎంపిక అయింది.జాతీయ పర్యాటక శాఖ టూరిజం అవార్డ్ ‌లను ఎంపిక చేసారు. తెలంగాణ రాష్ట్రం నుండి రెండు గ్రామాలు ఎంపిక కాగా ఒకటి పెంబర్తి,  రెండో గ్రామం సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం లోని చిన్నకోడూర్‌ ‌మండలం  చంద్లాపూర్‌ ‌గ్రామం… సీఎం కేసీఆర్‌ ,  ‌మంత్రి హరీష్‌ ‌రావు  చొరవ తో  రంగనాయక స్వామి కొలువైన ప్రాంతంలో  రంగనాయక కొండలు అద్భుతమైన ద్విపం గా రంగానాయక సాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌తో గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుంది.. నిత్యం  పర్యాటకులతో కనువిందు చేస్తున్న ఈ ప్రాంతం.. ఇక్కడి ప్రకృతి..

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబి దిశగా అవిషకృతం అవుతుంది.కొద్దీ రోజుల్లోనే మరో అద్భుతమైన గొప్ప డెస్టినేషన్‌ ‌సెంటర్‌ ‌గా మారనుంది… అదేవిధంగా ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభామ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబోతకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది.సిద్దిపేట ప్రాంతంలో చందల పూర్‌ ‌కనువిందు ప్రకృతి అందాలు , జల సందడి చేసే గొప్ప  పర్యాటక ప్రాంతం రంగనాయక సాగర్‌ .. ‌కళా నైపుణ్యతన, సంస్కృతి గొల్ల భామ చీర ప్రాచుర్యత కు నేడు జాతీయ స్థాయిలో  దక్కిన గొప్ప గుర్తింపు గా ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

image.pngఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు సంతోషం వ్యక్తం చేశారు.. సిద్దిపేట పర్యాటక , ఆహ్లాదకరమైన ప్రాంతం గా నెలవు మారింది అనడానికి గొప్ప నిదర్శనం నేడు జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతం చందల పూర్‌ ‌గ్రామం ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షల తెలిపారు.మంత్రి హరీష్‌ ‌రావు కృషి , పట్టుదలకు వారు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page