సిద్ధిపేటను కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నా

  • ఫేక్‌ ‌న్యూస్‌ ‌క్రియేట్‌లో బిజెపికి డాక్టరేట్‌ ఇవ్వాలి
  • మీరందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే కేసీఆర్‌ ‌శిక్షణకు నిజమైన సార్థకత
  • త్వరలోనే గ్రూప్‌-4 ‌నోటిఫికేషన్‌
  • ‌టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో మంత్రి హరీష్‌రావు ముఖాముఖి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేటను తన కుటుంబంగా భావించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట-పొన్నాలలోని జిల్లా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయంలో ఇటీవల టెట్‌ ‌పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతో మంత్రి హరీష్‌రావు బుధవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… డిఎస్సీ నోటిఫికేషన్‌ ‌రాకముందే లాంగ్‌టర్మ్ ‌శిక్షణ ఇప్పిస్తామనీ, తెలంగాణ రాష్ట్రంలో టెట్‌ ‌పరీక్షలో 32శాతం ఉత్తీర్ణతయితే, కేవలం సిద్ధిపేటలో నిర్వహించిన కేసీఆర్‌ ఉచిత శిక్షణ కేంద్రంలో 82శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇందులో 618 మంది అభ్యర్థులకుగానూ 517మంది అభ్యర్థులు పాసయ్యారన్నారు. త్వరలోనే గ్రూప్‌-4 ‌నోటిఫికేషన్‌ ‌రాబోతుందనీ, దానికి సైతం సంసిద్ధంగా ఉండాలనీ గ్రూప్స్-4 ‌కోచింగ్‌ ఉచితంగా ఇప్పిస్తానని మంత్రి వెల్లడించారు. వారు ఉద్యోగాలు సాధించినప్పుడే ఈ కేసీఆర్‌ ‌శిక్షణకు నిజమైన సార్థకత లభిస్తుందన్నారు.

ఈసారి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు చాలా అదృష్టవంతులనీ, సిఎం కేసీఆర్‌ ‌రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వొచ్చేలా కృషి చేశారన్నారు. 317జివో అంతర్యం తెలియకుండా మాట్లాడుతున్నారనీ, 317జివోను రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాదికే లక్షా 50వేల ఉద్యోగాలకు ఇప్పటికే లక్షా 30 ఉద్యోగాలు ఇచ్చామని, ఈ యేటా మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అయితే, బిజెపి కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని మంత్రి డిమాండ్‌ ‌చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ ‌తుమ్మితే ఊడిపోయే ఉద్యోగమని, యువతను నిర్వీర్యం, మోసం చేయడానికే ఈ పథకం తెచ్చారని మంత్రి విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అమ్మడం తప్ప కొత్తగా తెచ్చేది ఏమీ లేదనీ, ఏ రంగానికి కూడా బిజెపి ప్రభుత్వం మేలు చేయలేదన్నారు. రూపాయి విలువ పతనమై..దేశంలో 8.7 శాతం నిరుద్యోగ సమస్య ఉందనీ, ఫేక్‌ ‌న్యూస్‌ ‌క్రియేట్‌ ‌చేయడంలో బిజెపి పార్టీ ప్రభుత్వానికి డాక్టరేట్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదన్నారు. ఈ ముఖాముఖిలో సూడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఏఎంసి మాజీ ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, మునిసిపల్‌ ‌వైస్‌ ‌ఛైర్మన్‌ ‌జంగిటి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page