ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదివ వార్డులో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో రూ. 80 లక్షల వ్యయంతో కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో సిసిరోడ్లు నిర్మించారు… విద్యా నగర్ కాలనీ ప్రవేశపు దారిలో ఉన్న డ్రైనేజీ పై కప్పు వేయడం మరవడంతో విద్యానగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ కాలనీ అధ్యక్షులు ఎంఏ పాషా తెలిపారు. ఈ సమస్యను కౌన్సిలర్ సోనీ, కమిషనర్ శ్యాంసుందర్ పట్టించుకుని పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విద్యానగర్ కాలనీను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగిందని ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. సమస్యలతో పాటు అంతర్గత రోడ్లను ఏర్పాటు చేసి కాలానికి మిషన్ భగీరథ నీటిని కూడా అందుబాటులోకి తేవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కాలనీ రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను అనువైన స్థలాలలో ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది కూడా పారిశుధ్య నిర్వహణలో తగు జాగ్రత్తలు పాటించాలని లేనిచో పందులు దోమలు స్వైర విహారం చేత ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నట్లు దీనికి సంభందించి తగు చర్య తీసుకోవాసిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు.