హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘‌రోజు రోజుకు హరించుకుపోతున్న అడవి. పెరుగుతున్న కాంక్రీట్‌ ‌జంగల్‌.  ‌పెరుగుతున్న జనాభా వల్ల వాహన, పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల జీవారణం అంతా అస్తవ్యస్థమైంది. భూభాగంలో కనీసం 33శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో భూమిపై మొత్తం జీవన ప్రమాణాలే తగ్గిపోయి, అనారోగ్యాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.దీన్ని గుర్తించిన సీఎం కెసిఆర్‌  ‌ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్యక్రమంగా హరిత హారం కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు.’’

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి సీఎం కేసీఆర్‌  అనేక భిన్న, విభిన్న పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ఒకటి తెలంగాణకు హరితహారం పథకం.
రోజు రోజుకు హరించుకుపోతున్న అడవి. పెరుగుతున్న కాంక్రీట్‌ ‌జంగల్‌.  ‌పెరుగుతున్న జనాభా వల్ల వాహన, పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల జీవారణం అంతా అస్తవ్యస్థమైంది. భూభాగంలో కనీసం 33శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో భూమిపై మొత్తం జీవన ప్రమాణాలే తగ్గిపోయి, అనారోగ్యాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.దీన్ని గుర్తించిన సీఎం కెసిఆర్‌  ‌ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్యక్రమంగా హరిత హారం కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు.

మొక్కలని నాటి, వాటిని సంరక్షించి, అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కెసిఆర్‌ ‌హరితహారం స్పూర్తితో గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌లాంటి కార్యక్రమాలు కూడా ఒక ఉద్యమంలా కొనసాగుతున్నాయి. భూమిపై పచ్చదనాన్ని పెంచేందుకు చైనా, బ్రెజిల్‌ ‌తర్వాత జరుగుతున్న మూడవ మానవ మహా ప్రయత్నం ‘‘తెలంగాణకు హరితహారం’’ .తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తున్నది. గత ఎనిమిదేళ్ళలో 8,511 కోట్ల వ్యయంతో 243 కోట్ల మొక్కలు నాటబడ్డాయి. 9 లక్షల 65 వేల ఎకరాల అడవుల పునరుద్ధరణ జరిగింది. నగరాలు, పట్టణాల్లో 109 అర్బన్‌ ‌ఫారెస్టులు అభివృద్ధి చేయబడ్డాయి.

హరితహారంతో తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో గ్రీన్‌ ‌కవర్‌ 7.7 ‌శాతం పెరిగినట్లు ఫారెస్ట్ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా పేర్కొన్నది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పద్ధతిలో, అన్నివర్గాల భాగస్వామ్యంతో  ‘‘గ్రీన్‌ ‌బడ్జెట్‌’’ ‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణ, నగర పాలక సంస్థలు, స్థానిక సంస్థలలో కూడా ప్రత్యేకంగా 10శాతం గ్రీన్‌ ‌బడ్జెట్‌ ‌ను కేటాయించి, ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, ఇతర ప్రతి గ్రామంలోనూ మొక్కలను పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే హరిత హారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు.

ఇతర అన్ని అధికారిక సందర్భాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. పుట్టిన రోజున కూడా మొక్కలు నాటే సంప్రదాయం తెలంగాణలో కొనసాగుతున్నది. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక సంస్థలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారే తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను సమకూర్చడం వల్ల, అవి మొక్కల సంరక్షణకు కూడా ఉపయోగపడుతున్నాయి.
– సమాచార పౌర సంబంధాల శాఖ,తెలంగాణ ప్రభుత్వం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page